Ad Code

జులైలో 32 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపిన టెక్ కంపెనీలు !


టెక్ కంపెనీలు ఉద్యోగల్లో కోత విధిస్తున్నాయి. వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గత మూడు నెలల వ్యవధిలో యుక్రెయిన్ యుద్ధం, అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఆర్థిక మాంద్యానికి దారితీస్తోంది. దాంతో టెక్ కంపెనీలు తమ ఖర్చులను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే అనేక కంపెనీలు తమ ఉద్యోగాల్లో కోతలను ప్రకటించాయి. క్రంచ్‌బేస్ వివరణాత్మక నివేదిక ప్రకారం.. జూలై 2022 నాటికి.. సిలికాన్ వ్యాలీలో 32వేల మంది ఉద్యోగులను తొలగించాయి. నెట్‌ఫ్లిక్స్, షాపిఫై, కాయిన్‌బేస్, ఇతర పెద్ద టెక్ కంపెనీలు వందలాది మంది ఉద్యోగులను తొలగించాయి. దాదాపు ప్రతి వారం భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే.. ఏ ఉద్యోగమూ స్థిరంగా లేదని సూచిస్తుంది. స్పష్టమైన కారణం లేకుండానే ఉద్యోగాలు కోల్పోతున్నందున చాలా మందికి 2022 ఏడాది కష్టకాలమని చెప్పవచ్చు. కొన్ని టెక్ కంపెనీలు ఇప్పటికే నియామక ప్రక్రియను నిలిపివేశాయి. ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొనేందుకు చాలా మంది ఉద్యోగుల్లో కొంత మొత్తాన్నిమాత్రమే వినియోగించుకుంటున్నాయి టెక్ కంపెనీలు. అమెరికాలోని దాదాపు 64 ప్రముఖ టెక్ కంపెనీలు జూలైలో ఉద్యోగాల్లో కోతలను ప్రకటించాయి. మొత్తం ఉద్యోగుల తొలగింపుల సంఖ్య 32వేల కన్నా ఎక్కువే. క్రంచ్‌బేస్ డేటా ప్రకారం.. ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ Shopify కంపెనీ గత నెలలో 1,000 మంది ఉద్యోగులను తొలగించింది. రిక్రూటింగ్, సపోర్ట్, సేల్స్ విభాగాల్లో ఉద్యోగాల కోత విధించింది. ఈ-కామర్స్ ఇండస్ట్రీ కరోనావైరస్ మహమ్మారి సమయంలో అధిక లాభాలను సాధించేందుకు కంపెనీ ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకుంది. కానీ, ఆశించిన స్థాయిలో వృద్థి లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగింపులు చేపట్టింది. ట్విట్టర్ టాలెంట్ అక్విజిషన్ టీమ్‌లో 30 శాతం మందిని తొలగించింది. మైక్రో-బ్లాగింగ్ సైట్ వ్యాపార ఒత్తిళ్లను ఎదుర్కొంటోందని, సవరించిన వ్యాపార అవసరాల కారణంగా ఉద్యోగాల్లో కోతను విధిస్తోందని నివేదిక వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ 1,80,000 మంది వర్క్‌ఫోర్స్‌లో 1 శాతాన్ని తగ్గించింది. ఎందుకంటే కొన్ని నిర్మాణాత్మక సర్దుబాట్లు, వ్యాపార అవసరాలను తీర్చాలని యోచిస్తోంది. టిక్‌టాక్ కంపెనీ కూడా ఉద్యోగులను తొలగింపు చర్యలు చేపట్టింది. ఇప్పటికే100 కన్నా తక్కువ మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోందని నివేదిక పేర్కొంది. ఫిట్‌నెస్ వేరబుల్ కంపెనీ హూప్ వంటి ఇతర స్టార్టప్‌లు 15 శాతం మంది సిబ్బందిని తొలగించాయి. వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ Vimeo 72 మంది ఉద్యోగులను తొలగించింది. చాలా మంది ఉద్యోగులను తొలగించిన టెక్ కంపెనీల జాబితాలో అవుట్‌బ్రేన్, నియాంటిక్, జెమిని మరిన్ని ఉన్నాయి. కేవలం రెండు నెలల్లో, నెట్‌ఫ్లిక్స్ మొత్తం 450 మంది ఉద్యోగులను, అనేక మంది కాంట్రాక్టర్‌లను తొలగించింది. ఖర్చులను నియంత్రించడానికి ఉద్యోగుల తొలగింపు చర్యలు చేపట్టిందని కంపెనీ వివరించింది. క్రిప్టోకరెన్సీ ఇండస్ట్రీ కూడా ప్రభావితమైంది. కాయిన్‌బేస్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లు 1,100 మంది ఉద్యోగులను తొలగించాయి. ప్రాథమికంగా 18 శాతం మందిని తొలగించింది. కంపెనీ CEO బ్రియాన్ ఆర్మ్‌స్ట్రాంగ్ మొదట తొలగింపుకు ఆర్థిక పరిస్థితులే కారణమన్నారు. ఆపై కాయిన్‌బేస్ అధికంగా కాంట్రాక్ట్ ఆధారంగా తీసుకున్నారు. ఎందుకంటే క్రిప్టో వారానికోసారి మంచి ట్రాక్షన్‌ను పొందుతోంది. Spotify, Apple, Meta, Google వంటి ఇతర ప్రముఖ టెక్ కంపెనీలు కూడా నియామక ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. ఈ ఏడాదిలో నిర్దేశించిన లక్ష్యాన్ని తగ్గించి మళ్లీ నియామకాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu