Ad Code

కొత్త ఫీచర్స్ తో డిఫరెంట్ లుక్ ?


వాట్సాప్ కమ్యూనికేట్ అయ్యే విధానాన్ని మార్చేస్తోంది. ఇందులో ఇప్పటికే అందుబాటులో ఉన్న గొప్ప ఫీచర్లతో యూజర్లు తమ బంధు మిత్రులతో చాలా మెరుగ్గా కనెక్ట్ అవుతున్నారు. అయితే కమ్యూనికేషన్‌ను మరింత మెరుగుపరిచి యూజర్ ఎక్స్‌పీరియన్స్ అద్భుతంగా మార్చేందుకు వాట్సాప్ ఈ ఏడాది మరిన్ని ఫీచర్లను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. వాట్సాప్ తీసుకొస్తున్న పాస్ట్ పార్టిసిపెంట్స్  ఫీచర్ సాయంతో యూజర్లు తమ గ్రూప్ లో నుంచి లెఫ్ట్ అయిన వారు ఎవరో తెలుసుకోవచ్చు. పాస్ట్ పార్టిసిపెంట్స్ ఫీచర్ 60 రోజుల లోపు గ్రూప్ నుంచి వెళ్లిపోయిన వారు ఎవరో వివరంగా చూపిస్తుంది. దీని ద్వారా గ్రూప్‌లో కొత్తగా జాయిన్ అయ్యే వారికి గ్రూప్ ఎలాంటిదో తెలుస్తుంది. సెండ్‌ చేసిన తర్వాత సెండర్‌తో పాటు రిసీవర్ చాట్స్ నుంచి కూడా చాట్స్‌లను తొలగించే ఫీచర్‌ను పరిచయం చేసి యూజర్లను వాట్సాప్ ఆశ్చర్యపరిచింది. అదే డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్. దీనిని ఆన్ చేస్తే అన్ని మెసేజెస్ నిర్దిష్ట సమయంలో డిలీట్ అయిపోతాయి. ఇంపార్టెంట్ మెసేజ్‌లు కూడా డిలీట్ అయిపోతే ప్రాబ్లం కాబట్టి డెవలపర్లు ఇప్పుడు అలా మాయమయ్యే మెసేజెస్‌ను కూడా సేవ్ చేసుకునేలా ఒక ఫీచర్ తీసుకొస్తున్నారు. కీప్ మెసేజెస్ పేరుతో వస్తున్న ఈ అప్‌కమింగ్ ఫీచర్ వల్ల డిసప్పియరింగ్ మెసేజెస్ ఆన్‌లో ఉన్నా ఇంపార్టెంట్ మెసేజెస్ డిలీట్ కాకుండా సేవ్ చేసుకోవచ్చు. వాట్సాప్ తమ ఫ్లాట్‌ఫామ్‌లోని వీడియో చాట్స్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా వీడియో చాట్‌లలో డిజిటల్ అవతార్లను పరిచయం చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ ఫీచర్‌తో కార్టూన్ క్యారెక్టర్‌ని రూపొందించి వాటిని వీడియో కాల్స్‌లో ఉపయోగించవచ్చు. తద్వారా ప్రైవసీ కాపాడుకుంటూ వీడియో కాల్స్‌ ద్వారా మరింత ఫన్ పొందొచ్చు. వాట్సాప్ ఇటీవల చాట్ మెసేజ్‌లకు రియాక్షన్ ఎమోజీలను పరిచయం చేసిన విషయం తెలిసిందే. త్వరలో వాట్సాప్ స్టేటస్‌ల కోసం ఇలాంటి ఫీచర్‌ను లాంచ్ చేయనుంది. వాట్సాప్ యూజర్ల ప్రైవసీని కోరుకోవడం సహజం కానీ ఆన్‌లైన్‌లోకి రాగానే ఆ స్టేటస్ అన్ని కాంటాక్ట్స్‌కి తెలిసిపోతుంది. దీనివల్ల ప్రైవసీకి భంగం వాటిల్లుతోంది. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా వాట్సాప్ ఆన్‌లైన్ స్టేటస్ కూడా హైడ్ చేసుకునే వీలు కల్పించనుంది. లాస్ట్ సీన్‌తో పాటు ఆన్‌లైన్ స్టేటస్ సైతం హైడ్ చేస్తే ఎవరికీ తెలియకుండా చడీ చప్పుడు కాకుండా వాట్సాప్ వాడటం సాధ్యమవుతుంది. వాట్సాప్ డెవలపర్లు వాయిస్ నోట్స్‌కి వేవ్‌ఫామ్‌లను యాడ్ చేయనున్నారు. ఈ ఆడియో వేవ్‌ఫామ్ వాయిస్ నోట్ ప్లే చేసినప్పుడు చాట్ బబుల్‌లో కనిపిస్తుంది. వాయిస్ నోట్ ప్రారంభంలో ఎలాంటి సౌండ్ లేకుండా ఖాళీగా ఉంటే దానిని మీరు స్కిప్ చేయడానికి ఈ వేవ్‌ఫామ్స్‌ ఉపయోగపడతాయి. చివర్లో వాయిస్ కట్ చేయడానికి కూడా అదే యూజ్ అవుతాయి.

Post a Comment

0 Comments

Close Menu