Ad Code

వాట్సాప్‌ను ఎవరూ హ్యాక్ చేయలేరు !


వాట్సాప్ అకౌంట్స్‌ను హ్యాకర్లు యాక్సెస్ చేయకుండా ఇప్పటికే డబుల్ వెరిఫికేషన్ కోడ్ అనే ఒక ప్రైవసీ ఫీచర్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు వాట్సాప్ లాగిన్ అప్రూవల్  అనే మరొక కొత్త ఫీచర్‌ను కూడా పరిచయం చేసేందుకు సిద్ధమైందని వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది. హ్యాకర్లు వాట్సాప్ ఖాతాలను హ్యాక్ చేయకుండా ఈ సేఫ్టీ ఫీచర్ ఉపయోగపడుతుంది. "ఎవరో మీ వాట్సాప్ అకౌంట్‌కి లాగిన్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు" అనే లాగిన్ అప్రూవల్ అలర్ట్స్‌ను యాప్‌లోనే నోటిఫికేషన్లుగా ఇవ్వాలని వాట్సాప్ యోచిస్తోంది. వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం, వాట్సాప్ ఈ ఫీచర్‌పై పని చేస్తోంది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఒక స్క్రీన్‌షాట్ ద్వారా WABetaInfo వివరించింది. ఆ స్క్రీన్‌షాట్ ప్రకారం, లాగిన్ అట్టెంప్ట్స్‌ను యూజర్లు అప్రూవ్ చేస్తేనే లాగిన్ కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తి వారి వాట్సాప్ అకౌంట్‌కి లాగిన్ కాగలరు. అదే తిరస్కరిస్తే మాత్రం వారు లాగిన్ కాలేరు. ఈ లాగిన్ అలర్ట్స్‌ అనేవి అపరిచిత వ్యక్తి లాగిన్ కావడానికి ఎప్పుడు ప్రయత్నించారు? ఏ ఫోన్/డివైజ్‌లో ప్రయత్నించారు? వంటి ముఖ్య వివరాలను కూడా యూజర్లకు తెలియజేస్తాయి. స్క్రీన్‌షాట్‌లో "ఎవరో ఒక వ్యక్తి మీ వాట్సాప్ అకౌంట్‌ను తన డివైజ్‌కు మూవ్ చేయాలనుకుంటున్నారు. దీన్ని మీరు అలో చేస్తారా? లేదా?" అని ఒక నోటిఫికేషన్ అడుగుతున్నట్లు కనిపించింది. వాట్సాప్‌ బీటా ఇన్ఫో ప్రకారం, ఈ ఫీచర్‌తో 6-డిజిట్ కోడ్ తప్పుగా ఎంటర్ చేసే వారి లాగిన్ ప్రయత్నాలను యూజర్లు పూర్తిగా రిజెక్ట్/అలో చేయొచ్చు. ఫేస్‌బుక్, గూగుల్, అమెజాన్ సంస్థలు తమ యూజర్లకు లాగిన్ అప్రూవల్ అలర్ట్ ఫీచర్‌ని కొంతకాలం క్రితమే తీసుకు వచ్చాయి. ఎవరైనా గూగుల్/ఫేస్‌బుక్ అకౌంట్ లోకి లాగిన్ అవ్వాలని ట్రై చేస్తుంటే ఆ అకౌంట్ హోల్డర్‌కి వెంటనే లాగిన్‌ అలర్ట్ వెళ్లిపోతుంది. తద్వారా వారు అప్రమత్తం కావచ్చు. ఆ లాగిన్ అటెమ్ట్స్ అప్రూవ్ చేయాలా లేక రిజెక్ట్ చేయాలా అనేది కూడా నిర్ణయించుకోవచ్చు. సేమ్ అదే సెక్యూరిటీని వాట్సాప్ కూడా తన ఫ్లాట్‌ఫామ్‌లో తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతానికి వాట్సాప్ ఈ ఫీచర్‌ను పరీక్షిస్తోంది. పరీక్ష దశలో ఈ ఫీచర్ మెరుగ్గా పని చేసినట్లు తేలితే మరికొద్ది రోజుల్లోనే దీనిని బీటా వెర్షన్ ద్వారా అందుబాటులోకి తేవచ్చు. వాట్సాప్‌ను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఉపయోగిస్తున్నారు. వారందరికీ హ్యాకర్ల నుంచి కట్టుదిట్టమైన భద్రత అందించడమే లక్ష్యంగా వాట్సాప్ పని చేస్తోంది. వాట్సాప్‌ను ఉపయోగించడానికి.. SMS ద్వారా మీకు వాట్సాప్ ఒక 6-అంకెల కోడ్‌ని పంపిస్తుంది. ఆ కోడ్‌ని ఎంటర్ చేస్తేనే అకౌంట్ కి యాక్సెస్ లభిస్తుంది. అయితే ఈ ప్రాసెస్ కి భద్రత కోసం డబుల్ లేయర్‌ను వాట్సాప్ త్వరలోనే అందించనుంది.

Post a Comment

0 Comments

Close Menu