ఉబెర్ సంస్థ కస్టమర్ల కోసం తమ సేవలను సులభతరం చేస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ని పరిచయం చేస్తూ సేవలు అందిస్తోంది. తాజాగా ఈ సంస్థ వాట్సాప్‌లోనే ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకునే సదుపాయాన్నికల్పిస్తోంది. ఇక ఇప్పుడు యూజర్లు ఉబెర్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా కేవలం వాట్సాప్ ద్వారా ఈ సర్వీస్ అందిస్తోంది. వాట్సాప్ ద్వారానే రైడ్‌లను నేరుగా బుక్ చేసుకోవచ్చు.ఈ సర్వీస్ ఇప్పటికే లక్నో యూజర్లకు అందుబాటులోకి రాగా ఇప్పుడు ఢిల్లీ-ఎన్‌సీఆర్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం ఢిల్లీ NCR ప్రాంతంలో బుక్ చేసే రైడ్స్‌కి మాత్రమే వర్తిస్తుంది. ముంబై, బెంగళూరు వంటి నగరాలతో సహా ఇతర ప్రాంతాలలో కూడా ఉబెర్ ఈ ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. అలాగే ఉబెర్ వాట్సాప్‌లో ఇంగ్లీష్, హిందీ భాషలకు కూడా సపోర్ట్ చేస్తుంది. యూజర్ రిజిస్ట్రేషన్, రైడ్ బుక్ చేయడం, ట్రిప్ రసీదు పొందడం నుంచి ప్రతిదీ వాట్సాప్ చాట్‌బాట్ ద్వారానే రైడర్లు పూర్తి చేయవచ్చు. దీనివల్ల బుకింగ్ ప్రాసెస్ చాలా త్వరగా, సింపుల్‌గా అయిపోతుంది. ఉబెర్ కొత్తగా తీసుకొచ్చిన సదుపాయంతో కొన్ని సెకన్లలో వాట్సాప్‌లో ఉబెర్ రైడ్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇందుకు ఉబెర్ యాప్‌లోలాగా రిజిస్ట్రేషన్, లాగిన్ వంటి లాంగ్ ప్రాసెస్‌లు అనుసరించాల్సిన అవసరం లేదు. వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి పికప్, డ్రాప్ ఆఫ్ డెస్టినేషన్ వివరాలు అందిస్తే సరిపోతుంది. మొదటగా ఫోన్‌లో వాట్సాప్‌ని ఓపెన్ చేసి +91 7292000002 వాట్సాప్ నంబర్‌కి 'Hi' లేదా 'Hi Uber' అని మెసేజ్ పంపించాలి. లేదా ఉబెర్ ఇచ్చిన క్యూఆర్ కోడ్‌ని ఫోన్ కెమెరా యాప్ నుంచి స్కాన్ చేయవచ్చు. ఆ తర్వాత భాషను ఎంచుకుని పికప్, డ్రాప్-ఆఫ్ లొకేషన్ వివరాలను సెండ్ చేయాలి. రైడ్ కోసం ఎంత చెల్లించాలో ఒక ఎక్స్‌పెక్టెడ్ ఛార్జీని వాట్సాప్ చాట్ బాట్ చూపిస్తుంది. చివరగా ఫోన్ నంబర్‌కి వచ్చిన ఓటీపీని టైప్ చేసి మీ రైడ్‌ను దృవీకరించాలి. ఇక సమీపంలో ఉన్న ఉబెర్ డ్రైవర్ రైడ్ అభ్యర్థనను అంగీకరించిన వెంటనే, వాట్సాప్‌లోనే ఒక నోటిఫికేషన్ అందుతుంది. ఆ తర్వాత రైడ్ వివరాలను వాట్సాప్ చాట్‌లో ట్రాక్ చేయవచ్చు. మొబైల్ నంబర్‌తో సైన్ అప్ చేసి ఉంటేనే… వాట్సాప్ ద్వారా రైడ్‌ను బుక్ చేసుకోవడం సాధ్యం అవుతుంది.
0 Comments