Ad Code

ట్విట్టర్‌‭లో కొత్త ఫీచర్ సర్కిల్స్‌


ఇన్‌స్టాగ్రామ్‌కు పోటీగా ట్విట్టర్‌ కూడా సన్నిహితులతో మాట్లాడుకునేందుకు వీలుగా సర్కిల్స్‌కు శ్రీకారం చుట్టుంది. సర్కిల్‌లో ఉండే వ్యక్తులు లేదా స్నేహితులను ఎంచుకునే స్వేచ్ఛ యూజర్‌కే ఉంటుంది. తద్వారా వారందరితో సన్నిహిత సంభాషణలు జరుపుకొనే వీలు కలుగుతుంది. ఈ క్రమంలో ఒక గ్రూపును ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ సర్కిల్స్‌ ప్రస్తుతం ఐఔస్‌, ఆండ్రాయిడ్‌, ట్విటర్‌.కామ్‌ యూజర్లు అందరికీ అందుబాటులో ఉంది. అయితే పోస్టు చేసే ముందు అది అందరికీ ఉద్దేశించా లేక సర్కిల్‌కే పరిమితమా అన్నది యూజర్‌ చూసుకోవాలి. సర్కిల్‌ కిందకు 150 మంది వరకు చేర్చుకోవచ్చు. సర్కిల్‌ నుంచి కొందరిని యూజర్‌ తొలగించుకోవచ్చు. మరి కొందరిని కలుపుకోవచ్చు. తొలగించినట్టు సదరు వ్యక్తికి కూడా తెలియదు. తీసేసినట్టు నోటిఫికేషన్‌ వంటిది ఏదీ కూడా వెళ్ళదు. సర్కిల్‌కు పంపిన ట్వీట్లు గ్రీన్‌ బ్యాడ్జి కలిగి ఉంటాయి. సర్కిల్‌లో ఉన్న వ్యక్తులకే అవి కనిపిస్తాయి. అయితే వాటిని రీట్వీట్‌ లేదా షేర్‌ చేసేందుకు అవకాశం మాత్రం ఉండదు. రిప్లయ్‌లన్నీ ప్రైవేటుగానే ఉంటాయి. ఒక్కో యూజర్‌కి ఒక సర్కిల్‌కే అనుమతి ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu