Ad Code

యూట్యూబ్ లో 4కే వీడియోలు చూడాలంటే డబ్బులు చెల్లించాలి ?


యూట్యూబ్‌లో వీడియోలు ఉచితంగా చూడొచ్చు. వీడియో ప్రారంభంలో వచ్చే యాడ్స్ ద్వారా యూట్యూబ్‌కు ఆదాయం వస్తుంది. యూట్యూబ్ ప్రీమియం  సబ్‌స్క్రిప్షన్ ద్వారా కూడా ఆదాయాన్ని పెంచుకుంటోంది. యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబర్లను పెంచుకోవడానికి కొత్త మార్గాలు వెతుక్కుంటోంది. యూట్యూబ్‌లో 4కే రెజల్యూషన్ వీడియోలు చూడాలంటే ఇకపై యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తప్పనిసరి కానుంది. దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా, యూజర్లలో దీనిపై చర్చ జరుగుతోంది. 4కే వీడియోలు చూడాలంటే యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని తమకు నోటిఫికేషన్స్ వస్తున్నట్టు కొందరు యూజర్లు రెడిట్ ప్లాట్‌ఫామ్‌లో వివరించారు. సాధారణంగా 4కే స్మార్ట్ టీవీలు ఉన్నవారు ఎక్కువగా 4కే వీడియోలు చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. గూగుల్ అకౌంట్ ఉన్నవారు యూట్యూబ్ 4కే వీడియోలు చూడొచ్చు. వీడియో ప్లే చేసినప్పుడు యాడ్స్ వస్తుంటాయి. కొందరు యూజర్లు చెబుతున్నదాని ప్రకారం యూట్యూబ్ ప్రీమియం ఉన్నవారు మాత్రమే 4కే వీడియోలు చూడగలుగుతున్నారు. అంటే త్వరలో యూట్యూబ్‌లో 4కే వీడియోలు ఉచితంగా చూడటం సాధ్యం కాకపోవచ్చు. దాని బదులు 1440P లేదా 2కే వీడియోలు మాత్రమే ఉచితంగా చూడగలరు. అంతకన్నా మంచి క్వాలిటీ వీడియోలు కావాలంటే యూట్యూబ్ ప్రీమియం మెంబర్‌షిప్ తీసుకోవాలి. లేదా 2కే వీడియోలతో సంతృప్తి చెందాలి. ఇండియాలో యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరలు చూస్తే నెలకు రూ.129, మూడు నెలలకు రూ.399, ఏడాదికి రూ.1,290 చెల్లించాలి. ఫ్యామిలీ ప్లాన్ నెలకు రూ.189 నుంచి ప్రారంభం అవుతుంది. కుటుంబంలోని ఐదుగురికి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ యాక్సెస్ లభిస్తుంది. విద్యార్థులకు నెలకు రూ.79 నుంచి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ చేస్తోంది యూట్యూబ్. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారు యాడ్స్ లేకుండా వీడియోలు చూడొచ్చు. పిక్చర్ ఇన్ పిక్చర్ ప్లేబ్యాక్ ఫీచర్ లభిస్తుంది. యూట్యూబ్ ప్రీమియం మ్యూజిక్ యాక్సెస్ కూడా లభిస్తుంది. యూట్యూబ్ ప్రీమియం యూజర్లు వీడియోలు డౌన్‌లోడ్ చేసుకొని డేటా కనెక్షన్ లేని సమయంలో కూడా యూట్యూబ్ వీడియోలు చూడొచ్చు. ప్రీమియం సబ్‌స్క్రైబర్స్‌ని పెంచుకోవడానికి యూట్యూబ్ అనేక ప్రయత్నాలు చేస్తోంది. సాధారణంగా యూట్యూబ్ వీడియోలో ఒకటి లేదా రెండు యాడ్స్ వస్తాయి. వీడియో ప్రారంభంలో ఈ యాడ్స్ ఉంటాయి. డ్యూరేషన్ ఎక్కువగా ఉన్న వీడియోల్లో యాడ్స్ మధ్యలో ఉంటాయి. అయితే ఇటీవల యూట్యూబ్ స్కిప్ చేయడానికి వీలులేని ఐదు  యాడ్స్‌ని టెస్ట్ చేస్తున్నట్టు వార్తలొచ్చాయి.

Post a Comment

0 Comments

Close Menu