Ad Code

530 కోట్ల మొబైల్స్ చెత్త లోకి... !


మొబైల్ తయారీ కంపెనీలు పనికిరాని మొబైల్స్ నుంచి బంగారం, వెండి, రాగి, పెల్లీడియం వంటి విలువైన లోహాలను రీసైకిల్ చేస్తాయి. అయితే ఈసారి ఏకంగా దాదాపుగా 530 కోట్ల వరకు మొబైల్ ఫోన్స్‌ను వినియోగదారులు వాడటం నిలిపివేస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిలో ఎక్కువ భాగం మొబైల్స్‌ను పారేయడం ఇష్టం లేక ఇళ్లలో పెట్టుకుంటారు. కొంతమంది మాత్రం పారేస్తూ ఉంటారు. కొత్త గ్లోబల్ సర్వే ప్రకారం ఈరోజు ఒక్కో కుటుంబం ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రిక్ టూల్స్, హెయిర్ డ్రైయర్‌లు, టోస్టర్‌లు, ఇతర ఉపకరణాలు (ల్యాంప్‌లు మినహా) వంటి సగటున 74 ఈ-ఉత్పత్తులను ఉపయోగిస్తుంది. ప్రస్తుతం చాలా మంది రెండు ఫోన్లు ఉపయోగిస్తున్నారు. కొంతమంది కొత్త ఫోన్ కొన్నాక పాత ఫోన్‌కు మంచి రేటు రాలేదని వాడకుండా పక్కన పడేస్తారు అవసరం ఉన్నప్పుడు బ్యాకప్ ఫోన్‌గా ఉపయోగించుకుందాం అని. ఇలా రకరకాల కారణాల వల్ల ఈ-వేస్ట్ పెరిగిపోతుంది. ఆ 74 ఈ-ఉత్పత్తులలో 13 ఉపయోగించకుండా పక్కన ఉన్నాయి (వాటిలో 9 ఉపయోగించనివి కానీ పని చేస్తున్నాయి, 4 విరిగిపోయాయి). అనేక గృహాలు, వ్యాపార సంస్థలు మరమ్మత్తు లేదా రీసైక్లింగ్ కోసం వేస్ట్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురావడంలో ఎందుకు విఫలమవుతున్నాయి అని వెల్లడించడానికి నిర్వహించిన సర్వేల ఫలితాల ప్రకారం, వినియోగదారులు ఎక్కువగా నిల్వ చేసే చిన్న ఉత్పత్తులలో మొబైల్ ఫోన్‌లు 4వ స్థానంలో ఉన్నాయి. ఈ కథనం ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1,600 కోట్ల మొబైల్ ఫోన్లు ఉపయోగంలో ఉన్నాయి. 2022లో ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయిన సెల్ ఫోన్‌లు, ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌లు, టోస్టర్‌లు, కెమెరాల వంటి చిన్న వస్తువులు మొత్తం 24.5 మిలియన్ టన్నుల బరువును కలిగి ఉంటాయని అంచనా. ఇది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా కంటే నాలుగు రెట్లు ఎక్కువ. ప్రతి సంవత్సరం పెరుగుతున్న ఈ-వేస్ట్‌పై దృష్టి సారించకపోతే ఇది ప్రమాదమైన సమస్యగా మారనుంది.

Post a Comment

0 Comments

Close Menu