Ad Code

వచ్చే నెలలో శామ్‌సంగ్‌ ఫోన్లకు 5G సపోర్ట్‌ !


దేశంలో అక్టోబర్‌ 1న 5G సేవలు అధికారికంగా లాంచ్ అయ్యాయి. తర్వాత జియో, ఎయిర్‌టెల్‌ టెలికాం కంపెనీలు ఈ నెట్‌వర్క్‌ను కొన్ని సర్కిళ్లలో ప్రారంభించాయి. పూర్తి స్థాయిలో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కొన్ని నెలల సమయం పడుతుందని తెలిపాయి. అయితే ఇండియాలో 5G సేవలకు సపోర్ట్‌ చేసేలా కొన్ని మొబైల్‌ తయారీ సంస్థలు తమ ఫోన్లలో సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేయాల్సి ఉంది. ఈ అంశంలో శామ్‌సంగ్‌, యాపిల్ కంపెనీలు వెనకబడ్డాయి. గూగుల్‌ కూడా కొన్ని 5G స్మార్ట్‌ఫోన్‌లకు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ అందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వీలైనంత తర్వగా మొబైల్‌ కంపెనీలు తమ డివైజ్‌లను 5Gకి సపోర్ట్‌ చేసేలా అప్‌డేట్‌లు అందించాలని ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కొన్ని కంపెనీల ప్రతినిధులతో ప్రభుత్వం తాజాగా చర్చలు జరిపింది. 2022 నవంబర్ నాటికి తమ కంపెనీ లాంచ్‌ చేసిన అన్ని 5G స్మార్ట్‌ఫోన్‌లు OTA అప్‌డేట్‌ను పొందుతాయని శామ్‌సంగ్‌  ప్రకటించింది. శామ్‌సంగ్‌ ఇండియా ప్రతినిధి విడుదల చేసిన ఓ ప్రకటనలో.. 'శామ్‌సంగ్‌ 2009 నుంచి 5G టెక్నాలజీ అభివృద్ధికి మార్గదర్శకత్వం వహించింది. ప్రపంచవ్యాప్తంగా 5G టెక్నాలజీని స్టాండర్డైజింగ్‌ చేయడంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలో శామ్‌సంగ్‌ చాలా 5G ఫోన్లను లాంచ్‌ చేసింది. మేము మా ఆపరేటర్ భాగస్వాములతో సన్నిహితంగా పని చేస్తున్నాం. 2022 నవంబర్ మధ్య నాటికి మా 5G డివైజ్‌లు అన్నింటికీ OTA అప్‌డేట్‌లను అందజేస్తాం. ఈ అప్‌డేట్‌తో భారతీయ వినియోగదారులు 5G సేవలను వినియోగించుకోగలరు.' అని చెప్పారు.

Post a Comment

0 Comments

Close Menu