Header Ads Widget

మార్కెట్లోకి ఒప్పో ఏ77ఎస్ విడుదల


దేశీయ మార్కెట్లోకి ఒప్పో ఏ77ఎస్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ విడుదల  అయింది. దీనిలో  క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌ను అందించారు. 8 జీబీ ర్యామ్ ఇందులో ఉంది. ఈ ఫోన్‌లో 6.56 అంగుళాల ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.  8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధర రూ.17,999గా ఉంది. ఆరెంజ్, స్టారీ బ్లాక్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్ బ్యాక్ లభించనుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.56 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. 8 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది. కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి ఫీచర్లు ఇందులో అందించారు.

Post a Comment

0 Comments