Ad Code

పాలపుంత కంటే పెద్ద గెలాక్సీ !


అంతరిక్షంలో మనకు ఎన్నో అద్భుతాలు కనిపిస్తుంటాయి. వాటిలో గెలాక్సీలు కూడా ఒకటి. మన పాలపుంత సైజు తెలిస్తేనే అంత పెద్దదా? అనుకుంటూ ఆశ్చర్యపోతాం. కానీ దీని కన్నా పెద్ద గెలాక్సీలు అంతరిక్షంలో బోలెడు ఉన్నాయి. వీటిని ఇప్పటి వరకు స్పష్టంగా చూడటం మన వల్ల కాలేదు. హబుల్ టెలిస్కోప్ తయారు చేసి అంతరిక్షంలోకి పంపినా కూడా. అది కచ్చితమైన చిత్రాలను మనకు పంపలేకపోయింది. ఈ క్రమంలోనే నాసా పరిశోధకులు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను తయారు చేశారు. ఇది అంతరిక్షంలోని అనేక విషయాలను ఎన్నో రెట్లు స్పష్టంగా ఫొటోలు తీసి మనకు అందజేస్తోంది. తాజాగా ఈ టెలిస్కోప్.. ఐసీ 5332 అనే గెలాక్సీని ఫొటో తీసింది. అంతకముందు హబుల్ కూడా దీన్ని ఫొటో తీసినా దానిలో స్పష్టత లోపించింది. వెబ్ టెలిస్కోప్ అద్దాలు కూడా కావలసినంత చల్లగా లేకపోవడంతో ఇక్కడి మిడ్‌ ఇన్‌ఫ్రారెడ్ ప్రాంతాలను తన కెమెరాలో బంధించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈసారి వెబ్ టెలిస్కోప్‌లోని మిరి (మిడ్ ఇన్‌ఫ్రారెడ్ ఇన్‌స్ట్రుమెంట్స్) ఉపయోగించి శాస్త్రవేత్తలు ఈ గెలాక్సీ ఫొటో తీశారు. ఇది -266 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో కూడా పనిచేస్తుందట. మిరిని ఉపయోగించి తీసిన ఫొటోల్లో ఐసీ5332 గెలాక్సీ రూపురేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీని వెడల్పు 66 వేల కాంతి సంవత్సరాలు ఉంటుందని, ఇది మన పాలపుంత కంటే చాలా పెద్దదని శాస్త్రేవత్తలు అంటున్నారు. అంతేకాకుండా ఇది మన భూమి వైపే చూస్తున్నట్లు ఉండటంతో ఈ గెలాక్సీని పరిశీలించడం కొంత సులభంగా ఉంటుందని పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu