మైక్రోసాఫ్ట్ నుంచి చెత్త ఊడ్చే కొత్త యాప్ ?
Your Responsive Ads code (Google Ads)

మైక్రోసాఫ్ట్ నుంచి చెత్త ఊడ్చే కొత్త యాప్ ?


కంప్యూటర్ లో పనికి రాని చెత్త పేరుకుపోతుంది. మన కంప్యూటర్ లో అలాంటిది ఎంత చెత్తదాగివుందో చెప్పడం కష్టం. ఇవి కంప్యూటర్ పనితీరును మందగించేలా చేస్తాయి. దాంతో వేగంగా పనిచేయలేక యూజర్లు ఎంతో ఇబ్బందిపడతారు. వీటిని తొలగించే పరిష్కారం దిశగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కొత్త యాప్ తీసుకువస్తోంది. ఈ యాప్ పీసీలో మూలమూలలా దాగివున్న అనవసర చెత్తను ఏరిపారేస్తోంది. తద్వారా కంప్యూటర్ చురుకుగా, మెరుగైన పనితీరు కనబరిచేందుకు దోహదపడుతుంది. ప్రస్తుతం ఈ యాప్ అభివృద్ధి దశలో ఉంది. మైక్రోసాఫ్ట్ స్టోర్ లో ఇలాంటి క్లీనింగ్ యాప్స్ ఎన్ని ఉన్నా వాటన్నింటి కంటే ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని మైక్రోసాఫ్ట్ సంస్థ చెబుతోంది. ఈ కొత్త యాప్ కు పీసీ మేనేజర్‎గా నామకరణం చేసినట్టు తెలుస్తోంది. ఇది విండోస్ 10, ఆపై వెర్షన్లతో పనిచేస్తుంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ నిదానించడానికి గల కారణాలను అన్వేషించి ఆ దిశగా క్లీనింగ్ ప్రక్రియ చేపట్టడమే కాకుండా, సిస్టమ్ స్టోరేజి స్పేస్ ను కూడా ఓ చూపు చూస్తుంది. స్టోరేజిలో చెత్త ఫైళ్లు చేరకుండా ప్రక్షాళన చేస్తూ, తగినంత స్పేస్ ఉండేలా చూస్తుంది. కేవలం ఒక్క క్లిక్ తో వైరస్ లను గుర్తించడమే కాకుండా, తగిన పరిష్కారాలను కూడా చూపుతుంది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ వెబ్ సైట్ లో పేర్కొన్నారు. త్వరలోనే ఇది కొన్ని ప్రత్యేకమైన మార్కెట్లలోనే అందుబాటులోకి రానుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog