అరుణ గ్రహం అధ్యయనం కోసం ఇస్రో మార్స్ ఆర్బిటార్‌ను నింగికి పంపిన విషయం తెలిసిందే. అయితే ఆ మార్స్ ఆర్బిటార్ ఉపగ్రహంతో సంబంధాలు తెగిపోయినట్లు ఇస్రో ప్రకటించింది. కేవలం 6 నెలల జీవితకాలంతో ఆ ఆర్బిటార్‌ను మార్స్ గ్రహంపైకి పంపారు. కానీ ఎనిమిదేళ్ల తర్వాత ఆ ఆర్బిటార్‌తో లింకు తెగిపోయినట్లు ఇస్రో వెల్లడించింది. మార్స్ కక్ష్యలో మార్స్ ఆర్బిటార్ మిషన్ 8 ఏళ్లు ఎన్నో కీలక శాస్త్రీయ ఫలితాలను వెల్లడించినట్లు ఇస్రో తెలిపింది. ఏప్రిల్ నుంచి మార్స్ ఆర్బిటార్‌కు సూర్యకాంతి అందడం లేదని ఇస్రో తెలిపింది. ఆర్బిటార్‌లో ఉన్న ప్రొపెల్లెంట్ నిర్వీర్యం అయినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. 2013లో మార్స్ ఆర్బిటార్‌ను లాంచ్ చేశారు. ఆ ఆర్బిటార్ రెడ్ ప్లానెట్ చుట్టూ చక్కర్లు కొట్టింది. రూ.4.5 బిలియన్ల ఖర్చుతో మార్స్ ఆర్బిటార్‌ను ప్రయోగించారు. మార్స్ గ్రహానికి ఆర్బిటార్లను పంపిన దేశాల్లో రష్యా, చైనా ఉన్నాయి.
0 Comments