యూట్యూబ్ వెల్‌కమ్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ఈ ప్రీమియం మెంబర్‌షిప్ కింద రూ. 10కి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్‌ను పొందే యూజర్లు మూడు నెలల పాటు యూట్యూబ్ ప్రీమియం సభ్యత్వాన్ని పొందవచ్చు. ఆ తర్వాత నెలకు రూ. 129 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ ఎంతకాలం అందుబాటులో ఉంటుందో కంపెనీ వెల్లడించలేదు. ఆఫర్ లిమిటెడ్ కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. యూట్యూబ్ ప్రీమియం అనేది ప్రాథమికంగా సబ్‌స్క్రిప్షన్-ఆధారిత సర్వీసు. యాడ్-ఫ్రీ వీడియో ఎక్స్ ఫీరియన్స్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీడియోలను ఆఫ్‌లైన్‌లో ప్లే చేయడం, బ్యాక్‌గ్రౌండ్‌లో వీడియోలను ప్లే చేయడం, యూట్యూబ్ మ్యూజిక్ కు మెంబర్‌షిప్ యాడ్ ఫ్రీ ఎక్స్ పీరియన్స్ వంటి అనేక ఇతర ఫీచర్‌లను యూట్యూబ్ కిడ్స్ యాప్‌పై అందిస్తుంది.
యూట్యూబ్ వెల్‌కమ్ ప్రోగ్రామ్ !
0
October 11, 2022
Tags