మార్కెట్‌లో స్మార్ట్ వాచ్‌లకు డిమాండ్ కనిపిస్తోంది. ఇప్పుడు స్మార్ట్ వాచ్‌లు హెల్త్ ట్రాకింగ్ ఫీచర్ లపై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. వీటితో శరీరంలో జరిగే అనూహ్య మార్పులను సులువుగా గుర్తించే అవకాశం దక్కుతోంది. ఈ తరహాలోనే ఓ మహిళ గర్భం దాల్చిన విషయాన్ని ముందుగా యాపిల్ వాచ్ గుర్తించింది. గర్భం దాల్చిన విషయం తాను గుర్తించక ముందే యాపిల్ వాచ్ సూచించిందని ఓ మహిళ పేర్కొంది. ఆమె వయసు 34 సంవత్సరాలు. తన యావరేజ్ రెస్టింగ్ హార్ట్ రేట్ కొన్ని రోజులలో గణనీయంగా పెరిగినట్లు యాపిల్ వాచ్ చూపించిందని ఆమె తెలిపారు. యావరేజ్ రెస్టింగ్ హార్ట్ రేట్ పెరగడం చూసి శరీరంలో ఏవో మార్పులు జరిగినట్లు అనుమానించినట్లు రెడ్డిట్ పోస్ట్‌లో పేర్కొన్నారు. సోషల్ బ్లాగింగ్ సైట్ రెడ్డిట్‌లో ఆమె చేసిన పోస్ట్‌లో.. 'సాధారణంగా నా రెస్టింగ్ హార్ట్ రేట్ 57గా ఉంటుంది. అయితే కొన్ని రోజులలోనే నా రెస్టింగ్ హార్ట్ రేట్ 72కి పెరిగింది. రెస్టింగ్ హార్ట్ రేట్‌లో ఆందోళన చెందాల్సిన స్థాయిలో మార్పులు కనిపించకపోయినా.. 15 రోజులుగా ఎక్కువగా ఉన్నట్లు వాచ్ అలర్ట్ చేసింది. ఈ తేడా ఎందుకు వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేశాను. నాకు తెలియకముందే నేను గర్భం దాల్చినట్లు యాపిల్ వాచ్‌కు తెలుసు! పీరియడ్ ఎప్పుడూ ఆలస్యం కాలేదు, అందుకే ఎలాంటి టెస్టింగ్ కూడా చేయించుకోలేదు. కేవలం వాచ్ రీడింగ్‌తోనే ఈ విషయం తెలిసింది' అని వివరించింది. టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ ఇండియాలో వాచ్ సిరీస్ 8ను అనౌన్స్ చేసింది. ఇందులో మహిళల హెల్త్‌ను ట్రాక్ చేసేందుకు అత్యాధునిక ఫీచర్లను, హెల్త్ కేపబిలిటీస్‌ను అందిస్తుంది. యాసిల్ సిరీస్ 8 శరీరం బేసల్ టెంపరేచర్‌ను గుర్తించడంలో సహాయపడే కొత్త టెంపరేచర్ సెన్సార్‌తో వస్తుంది. ఈ ఫీచర్ సిరీస్ 8, అల్ట్రాలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్ మహిళల పీరియడ్ డేట్స్ గురించి అలర్ట్ చేస్తుంది. పీరియడ్స్ సైకిల్‌ను ట్రాక్ చేస్తుంది.
యాపిల్ వాచ్‌తో ప్రెగ్నెన్సీ టెస్ట్ ?
0
October 10, 2022
Tags