వాట్సాప్‌లో కొత్త అప్‌డేట్ ?
Your Responsive Ads code (Google Ads)

వాట్సాప్‌లో కొత్త అప్‌డేట్ ?


వాట్సాప్ 'ఫార్వర్డ్ మీడియా విత్ క్యాప్షన్' అనే కొత్త అప్‌డేట్ తీసుకు రావడానికి సిద్ధమైంది. ఈ అప్‌డేట్ గురించి వాట్సాప్ ట్రాకర్ WABetaInfo రిపోర్ట్ చేసింది. వాట్సాప్ బీటా ఇన్ఫో రిపోర్ట్ ప్రకారం, ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఇంకా డెవలప్‌మెంట్ స్టేజ్‌లోనే ఉంది.  సాధారణంగా వాట్సాప్‌లో క్యాప్షన్ గల మీడియా ఫైల్స్ ఫార్వర్డ్ చేసినప్పుడు అవి క్యాప్షన్ లేకుండానే అవతలి వ్యక్తికి సెండ్ అవుతుంటాయి. ఫార్వర్డ్ చేసే ఫొటోలు, వీడియోలు, గిఫ్స్ (GIFs), డాక్యుమెంట్స్ వంటి మీడియా ఫైల్స్ అన్నిటిలో ఇలానే క్యాప్షన్‌ మిస్ అవుతుంటుంది. ఫలితంగా ఫార్వర్డ్ చేసే ప్రతి మీడియా మెసేజ్‌కి క్యాప్షన్ జత చేయాల్సిన వస్తోంది. కొత్త అప్‌డేట్‌తో ఈ సమస్యకు వాట్సాప్ చెక్ పెట్టనుంది. సరికొత్త అప్‌డేట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత యూజర్లు మీడియా ఫైల్స్‌తో పాటు క్యాప్షన్ కూడా ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అప్పుడు రిసీవర్‌కి క్యాప్షన్‌తోనే మీడియా అందుతుంది. వాట్సాప్ బీటా ఇన్ఫో షేర్ చేసిన ఒక స్క్రీన్‌షాట్ ప్రకారం, కొత్త అప్‌డేట్‌తో యూజర్లు మీడియా ఫైల్స్‌ను క్యాప్షన్‌తో ఫార్వర్డ్ చేయడమే కాదు క్యాప్షన్ లేకుండా కూడా పంపించొచ్చు. షేర్ చేసేటప్పుడు మీడియా ఫైల్స్ కింద క్యాప్షన్ బాక్స్‌లో క్యాప్షన్ కనిపిస్తుంది. ఈ కాప్షన్ క్లియర్/ఎడిట్ చేయొచ్చు. లేదంటే ఆ క్యాప్షన్‌తోనే డైరెక్ట్‌గా మీడియా ఫైల్ ఫార్వర్డ్ చేయవచ్చు. WABetaInfo షేర్ చేసిన స్క్రీన్‌షాట్‌లో ఫార్వార్డ్ చేసిన కంటెంట్‌కు క్యాప్షన్‌ను చేర్చాలను కుంటున్నారా అని ఒక పాప్‌-అప్ కనిపించింది. మల్టీమీడియా కంటెంట్‌కు క్యాప్షన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ కొత్త పాప్‌-అప్/ఇంటర్‌ఫేస్ కనిపిస్తుంది. ఈ ఇంటర్‌ఫేస్ కింద ఉన్న డిస్మిస్ బటన్‌ను నొక్కడం ద్వారా క్యాప్షన్‌ను రిమూవ్ చేయవచ్చు. ఇక ప్రస్తుతానికి వాట్సాప్‌లో ఒకేసారి 5 కాంటాక్ట్స్‌కి మాత్రమే మెసేజ్‌లను ఫార్వర్డ్ చేయడం కుదురుతుంది. వాట్సాప్ ఇటీవల అప్‌డేటెడ్ స్టేటస్‌లు ఈజీగా కనిపెట్టడానికి వీలుగా కొత్తగా స్టేటస్ అప్‌డేట్ చేసిన వారి కాంటాక్ట్ ఐకాన్ చుట్టూ ఒక సర్కిల్‌ను చూపించడం ప్రారంభించింది. త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్లకు అవతార్ క్రియేట్ చేసుకునే వీలు కల్పించనుంది. అలాగే ఒకే మెసేజ్‌కు 4 ఎమోజీలతో రియాక్ట్ అయ్యేలా ఒక అప్‌డేట్ విడుదల చేయనుంది. అంతేకాకుండా, పంపించిన మెసేజ్‌లను ఎడిట్ చేసే సదుపాయం అందించనుంది 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog