Ad Code

వర్క్ ఫ్రం హోం వైపే ఇన్ఫోసిస్ మొగ్గు !


ఉద్యోగులు ఆఫీసుకు రావడాన్ని ఇప్పుడప్పుడే తప్పనిసరి చేయబోమని ఇన్ఫోసిస్ తేల్చి చెప్పింది. వారంలో కొన్ని రోజులు ఇంటి నుండి, మిగిలిన రోజులు ఆఫీసు నుండి పని చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది రావడం లేదని సీఈఓ సలీల్ పరేఖ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి విధానమే మరికొంత కాలం కొనసాగించనున్నట్లు తెలిపారు. ఉద్యోగులు ఖచ్ఛితంగా కార్యాలయాలకు రావాలన్న నిబంధనల నియమం పెట్టబోమని తేల్చి చెప్పారు. ఇంటి నుండి పని చేసేందుకు ఉద్యోగుల నుండి వస్తున్న స్పందన బాగుందన్నారు. ప్రస్తుతం భారత్ లో, ఇన్ఫోసిస్ కార్యాలయాలకు వచ్చి, 45వేలకు తగ్గకుండా ఉద్యోగులు పని చేస్తున్నారన్నారు. వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. అయితే ఉద్యోగులు ఆఫీసుకు వచ్చేందుకు అన్ని రకాలుగా సహకరిస్తామన్నారు.  కొన్ని సందర్భాలలో క్లయింట్ల అవసరానికి అనుగుణంగా ఉద్యోగులు నడుచుకోవాల్సి ఉంటుందని సీఈవో పేర్కొన్నారు. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో కొత్తగా 50వేల మంది ఉద్యోగులను ఫ్రెషర్స్ కింద తీసుకొనే క్రమంలో ఇప్పటికే 40వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 3,45,218కు చేరుకొందన్నారు. వలసల రేటు 27.1 శాతానికి తగ్గిందన్నారు. మూన్ లైటింగ్ విధానానికి కంపెనీ పూర్తి వ్యతిరేకమని సీఈఓ సలీల్ పరేఖ్ స్పష్టం చేశారు. ఉద్యోగులందరూ కొత్త టెక్నాలజీలు నేర్చుకొనే అవకాశాలు కల్పిస్తూ, గిగ్ అవకాశాలను అందించడం కోసం యాక్సెలరేట్ పేరుతో ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసిన్నట్లు ఆయన వెల్లడించారు.

Post a Comment

0 Comments

Close Menu