Ad Code

తగ్గిన ఒప్పో ఫోన్ల ధరలు !


ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు సరికొత్త ఫీచర్లతో టాప్ మొబైల్ బ్రాండ్లు కొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన పాత మోడళ్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. తాజాగా ఒప్పో కంపెనీ కూడా ఇదే బాటలో నడుస్తోంది. ఇండియన్ మార్కెట్‌లో రిలీజ్ చేసిన కొన్ని మోడళ్ల ధరలను తగ్గించినట్లు ఒప్పో ఇండియా తెలిపింది. ముంబైకి చెందిన మహేశ్ టెలికామ్ రిటైలర్ స్టోర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒప్పో ఇండియా మూడు మోడళ్ల ధరలను తగ్గించింది. ఇప్పుడు ఒప్పో ఎఫ్ 21 ప్రో, ఒప్పో ఏ 55, ఒప్పో ఏ 77 ఫోన్లు ఇండియన్ మార్కెట్‌లో చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఒప్పో ఏ 55 స్మార్ట్‌ఫోన్ 2021లో రూ. 15,490 ప్రారంభ ధరతో మార్కెట్లోకి లాంచ్ కాగా, ఇప్పుడు దీని ధరను కంపెనీ తగ్గించింది. ఒప్పో A55 బడ్జెట్ డివైజ్ 4GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు రూ.14,499కి లభిస్తుంది. ఫోన్ 6GB RAM మోడల్ మాత్రం రూ. 14,999 ధర వద్ద అందుబాటులో ఉంటుంది. ఒప్పో ఏ 77 హ్యాండ్‌సెట్ 4GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధరను ఒప్పో ఇండియా తాజాగా తగ్గించింది. ఈ ఫోన్‌ను ఇప్పుడు రూ.15,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 720x1,612 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో, 6.56 అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తుంది. దీని స్క్రీన్ 90 Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 SoC చిప్‌సెట్‌తో పనిచేసే ఈ డివైజ్ ColorOS 12.1 బేస్డ్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 33W SuperVOOC ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5,000mAh బ్యాటరీ ఫోన్‌ మరో ప్రత్యేకత. ఒప్పో F21 ప్రో  ఫోన్ 32MP సోనీ సెల్ఫీ కెమెరా ప్రధాన హైలెట్. 15x/30x మాగ్నిఫికేషన్ కోసం F21 ప్రోలో 2MP మైక్రోలెన్స్‌ను కూడా కంపెనీ యాడ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ సన్‌సెట్ ఆరెంజ్, కాస్మిక్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. సన్‌సెట్ ఆరెంజ్ మోడల్ క్లాసిక్ ఫైబర్‌గ్లాస్ లెదర్ డిజైన్‌తో వస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 5G SoC చిప్‌తో ఫోన్ పనిచేస్తుంది. దీని 8 జీబీ ర్యామ్, 128 స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999గా ఉంది. మార్కెట్లోకి లాంచ్ అయినప్పుడు దీని ధర రూ.22,999గా ఉంది. అంటే ఈమేరకు ధర తగ్గింది.

Post a Comment

0 Comments

Close Menu