Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Thursday, November 10, 2022

108 ఎంపీ ప్రైమరీ కెమెరాతో నార్డ్ సీఈ 3 !


వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 ఫ్లాగ్‌షిప్ లెవెల్ ఫీచర్లను అందుబాటు ధరలో ఆఫర్ చేయనుంది. వచ్చే ఏడాది ప్రధమార్ధంలో రానున్న లేటెస్ట్ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ 108 ఎంపీ ప్రైమరీ కెమెరాతో, క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌ను కలిగిఉంటుంది. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో 6.7 ఇంచ్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో కస్టమర్ల ముందుకొస్తుంది. ఈ ఏడాది ఆరంభంలో లాంఛ్ అయిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ2కు కొనసాగింపుగా మార్కెట్‌లోకి రానున్న వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 108 ఎఓంపీ ప్రైమరీ కెమెరాతో పాటు డ్యూయల్ 2 ఎంపీ కెమెరా సెటప్‌తో కస్టమర్లను ఆకట్టుకోనుంది. ఇక వన్‌ప్లస్ ఫోన్ 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో 67డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

No comments:

Post a Comment

Popular Posts