Ad Code

12 నగరాల్లో ఎయిర్‌టెల్ 5G సర్వీసులు !


ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ తమ 5G సర్వీసులను విస్తరిస్తోంది. ఇప్పటికే ఎయిర్‌టెల్  సర్వీసులను ఇప్పుడు మరిన్ని భారతీయ నగరాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో దాదాపు ప్రతిరోజూ 5G లిస్టులో కొత్త నగరాలను యాడ్ చేస్తున్నాయి. కస్టమర్లకు 5G సర్వీసులను వేగవంతంగా అందించేందుకు ఇప్పుడు కొన్ని విమానాశ్రయాల్లో 5G సర్వీసులను కూడా అందుబాటులో తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఢిల్లీ, సిలిగురి, బెంగళూరు, హైదరాబాద్, వారణాసి, ముంబై, నాగ్‌పూర్, చెన్నైతో సహా 12 భారతీయ నగరాల్లో అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత గురుగ్రామ్, పానిపట్, గౌహతిలో కూడా నెట్‌వర్క్ అందుబాటులోకి తీసుకొచ్చింది. పాట్నా సాహిబ్ గురుద్వారా, పాట్నా రైల్వే స్టేషన్, డాక్ బంగ్లా, మౌర్య లోక్, బైలీ రోడ్, బోరింగ్ రోడ్, సిటీ సెంటర్ మాల్, పాట్లీపుత్ర ఇండస్ట్రియల్ ఏరియా, మరికొన్ని ప్రదేశాలతో సహా పాట్నాలోని అనేక ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ తమ 5G సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. విమానాశ్రయాల విషయానికొస్తే.. వినియోగదారులు బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, పూణేలోని లోహెగావ్ విమానాశ్రయం, వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం, నాగ్‌పూర్‌లోని బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం, పాట్నా విమానాశ్రయంలో ఎయిర్‌టెల్ 5G పొందవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu