వివో ఎక్స్90 సిరీస్ త్వరలో లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. వివో ఎక్స్80 సిరీస్‌కు కొనసాగింపుగా వివో ఎక్స్90. నవంబర్ 22న చైనాలో వివో ఎక్స్90 లాంఛ్ కానుండగా ఈ సిరీస్ భారత్‌లోనూ లాంఛ్ కానుంది. వివో ఎక్స్90 సిరీస్‌లో భాగంగా వివో ఎక్స్90, వివో ఎక్స్90ప్రొ, వివో ఎక్స్90ప్రొ+ కస్టమర్ల ముందుకు రానున్నాయి. ఈ సిరీస్‌లో ఎన్ని డివైజ్‌లు లాంఛ్ చేస్తామని ఇప్పటివరకూ వివో వెల్లడించలేదు. ఈ స్మార్ట్‌ఫోన్ బ్రైట్ రెడ్ కలర్‌తో పాటు బ్లాక్ కలర్‌లో రియర్ సైడ్ భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్‌తో వివో ఎక్స్90 కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్989 1 ఇంచ్ ప్రైమరీ కెమెరా సెన్సర్‌తో పాటు 48ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 50ఎంపీ పోర్ట్రయిట్ టెలిఫొటో కెమెరా, 64ఎంపీ ఒమ్నివిజన్ ఓవీ64బి పెరిస్కోప్ కెమెరాను కలిగిఉంది. క్యూహెచ్‌డీ+ రిజల్యూషన్‌తో 6.78 ఇంచ్ అమోల్డ్ డిస్‌ప్లే, క్వాల్‌కాం ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్‌సెట్ వంటి ఫీచర్లతో రానుంది. వివో ఎక్స్90 అండ్రాయిడ్ 13 అవుటాఫ్‌దిబాక్స్ ఓఎస్‌తో ఫన్ టచ్ ఓఎస్ 13 అవుటాఫ్‌ది బాక్స్ ఓఎస్‌పై రన్ అవుతుంది. ఇక వివో ఎక్స్90 100డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది.
0 Comments