ఈనెల 26న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పీఎస్ఎల్వీ-54 ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించింది. శ్రీహరికోట లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్(పీఎస్ఎల్వీ)-54. శనివారం ఉదయం 11.56 గంటలకు ఈ ప్రయోగం జరుగనున్నట్లు వెల్లడించింది. ఓషన్ షాట్-3 ఉపగ్రహంతో పాటు మరో ఎనిమిది నానో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. ఓషన్ షాట్-3తో పాటు భూటాన్ శాట్, ఆనంద్, ధృవ స్పేస్ నుంచి రెండు టైబోల్ట్ శాటిలైట్లను, నాలుగు ఆస్ట్రోకాస్ట్ శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టనుంది పీఎస్ఎల్వీ-54. ఇస్రో అత్యంత సక్సెస్ ఫుల్ ఉపగ్రహ వాహకనౌక పీఎస్ఎల్వీ ద్వారా వీటన్నింటిని అంతరిక్షంలోకి చేర్చనున్నారు. భూ పరిశీలన ఉపగ్రహం(ఈఓఎస్)గా ఓషన్‌శాట్ ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఓషన్‌శాట్ సిరీస్ లో ఓషన్‌శాట్-1, ఓషన్‌శాట్-2 ఉప్రగ్రహాలను ప్రయోగించారు. ప్రస్తుతం ఈ సిరీస్ లో మూడో ఉప్రగ్రహంగా ఓషన్‌శాట్-3ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. సముద్ర అధ్యయనం, వాతావరణ అధ్యయనాలకు ఈ ఓషన్‌శాట్ ఉపగ్రహాలు ఉపయోగపడుతున్నాయి. తుఫానుల అంచనా వేయడానికి ఇవి సహకరిస్తాయి. ఈ ఉపగ్రహ శ్రేణిలో ఓషన్‌శాట్-3ఏను 2023లో ఇస్రో ప్రయోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Search This Blog
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...
No comments:
Post a Comment