Ad Code

నోకియా జీ 60 5జీ విడుదల !


దేశీయ మార్కెట్లోకి నోకియా జీ 60 5జీ స్మార్ట్ ఫోన్ విడుదలైంది.  ఈరోజే విడుదలైన ఈ సరికొత్త నోకియా 5G స్మార్ట్ ఫోన్ గొరిల్లా గ్లాస్ 5 రక్షతో మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన FHD+ డిస్ప్లే మరియు 50MP AI ట్రిపుల్ కెమెరా వంటి అక్షర్షణీయమైన ఫీచర్లతో లాంచ్ అయ్యింది. ముందుగా యురేపియన్ మార్కెట్ లో లాంచ్ అయిన ఈ నోకియా జి60 5జి ఫోన్ ఇప్పుడు ఇండియాలో కూడా లాంచ్ చేయబడింది. నోకియా జి 60 5జి స్మార్ట్ ఫోన్ Snapdragon 695 ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఈ ప్రొసెసర్ కి జతగా 6 జీబీ ర్యామ్ మరియు 128 ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. Nokia G60 5G పెద్ద 6.58 -అంగుళాల FHD+ స్క్రీన్ తో వస్తుంది మరియు ఈ డిస్ప్లే 12Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో ఉంటుంది. ఈ డిస్ప్లే రక్షణ కోసం పైన గొరిల్లా గ్లాస్ 5 ని కంపెనీ అందించింది. ఈ డిస్ప్లే మరియు ఫోన్ కు పవర్ ఇవ్వడానికి తగిన శక్తివంతమైన 5000 mAh బ్యాటరీని 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇవ్వబడింది. నోకియా జి 60 5జి లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP ప్రధాన కెమెరా, 5MP అల్ట్రా వైడ్ సెన్సార్ మరియు 2MP డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు 8 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా వుంది. ఈ స్మార్ట్ ఫోన్ f / 1.8 కెమెరా ఎపర్చరును కలిగి ఉంది. ఇది AI Portrait, డార్క్ విజన్, నైట్ సెల్ఫీ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ ఎటువంటి యాడ్స్ బెడదా లేని Android 12 OS పైన నడుస్తుంది మరియు 3 మేజర్ అప్డేట్స్ ను అందుకుంటుందని కంపెనీ తెలిపింది. రూ.29,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ బ్లాక్ మరియు ఐస్ రెండు కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ Nokia.com ద్వారా నవంబర్ 8 నుండి విక్రయించబడుతుంది. అంతేకాదు, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రిటైల్ అవుట్ లెట్లలో కూడా లభిస్తుంది. ఈ ఫోన్ ను ఈరోజు నుండి నవంబర్ 7 వ తేదీ వరకూ ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు మరియు ఆర్డర్ చేసే కస్టమర్లు రూ.3,599 రూపాయల విలువైన నోకియా వైర్డ్ బడ్స్ను ఉచితంగా పొందవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu