Ad Code

హెచ్ పీ నుండి 6000 మందిని తొలగించేందుకు రంగం సిద్ధం !


ప్రస్తుత మాంద్యం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన హెచ్ పీ వ్యాపారాన్ని సైతం అతలాకుతలం చేస్తోంది. దీంతో ఫేస్‌బుక్, అమెజాన్, ట్విట్టర్ వంటి దిగ్గజాల తర్వాత.. హ్యూలెట్ ప్యాకర్డ్ ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. తన ప్లాన్ లో భాగంగా కంపెనీ సుమారు 6000 మందిని తొలగించేందుకు సిద్ధంగా ఉంది. మాంద్యం ఆవరించిన వేళ చాలా మంది ప్రజలు కొత్త వస్తువులను కొనేందుకు విముఖత చూపుతున్నారు. దీంతో పర్సనల్ కంప్యూటర్లకు భారీగా డిమాండ్ తగ్గింది. ఇది కంపెనీ ఆదాయం, లాభదాయకతలపై పెద్ద ప్రభావాన్ని చూపింది. రానున్న మూడేళ్లలో మెుత్తంగా 10 శాతం ఉద్యోగులను తొలగించాలని హెచ్ పీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. గతంలో అమెరికాకు చెందిన చిప్ మేకర్ ఇంటెల్ సైతం ఇదే కారణంతో ఉద్యోగుల తొలగింపును ప్రకటించింది. ప్రస్తుతం కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 61 వేల మందిలో 10 శాతం ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్లు కంపెనీ సీఈవో ఎన్రిక్ లోర్స్ వెల్లడించారు. కంపెనీ పునర్వ్యవస్థీకరణ ఖర్చులు మొత్తం 1 బిలియన్ డాలర్లుగా అంచనా వేసినట్లు చెప్పారు. ఆ ఖర్చుల్లో దాదాపు 60% కొత్త ఆర్థిక సంవత్సరంలో 2023లో తగ్గుతాయని వెల్లడించారు. ఈ ప్రణాళిక 2025 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఏడాదికి 1.4 బిలియన్ డాలర్లను ఆదా చేస్తుందని స్పష్టం చేశారు. 

Post a Comment

0 Comments

Close Menu