Ad Code

హోండా యాక్టివా 7జీ !


హోండా త్వరలో కొత్త యాక్టివాని తీసుకురానుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వెర్షన్ తో పోల్చుకుంటే యాక్టివా 7జీ లో చాలా మార్పులు ఉన్నట్టు తెలుస్తోంది. పెట్రోల్ ఇంజిన్‌ తో కంపెనీ 7జీ యాక్టివా లో హైబ్రిడ్ ఇంజిన్‌ అందించవచ్చు. ఈ ఇంజన్ 109 సిసి హైబ్రిడ్ ఇంజన్ కావచ్చు. హైబ్రిడ్‌తో పాటుగా కంపెనీ కొత్త యాక్టివాలో ఐడిల్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీని కూడా అందించనున్నట్లు తెలుస్తోంది. అంటే స్కూటర్ కొద్దిసేపు ఆన్ చేసి ఉంటే ఆగిపోతుంది. మళ్ళీ క్లచ్ నొక్కిన వెంటనే స్టార్ట్ అవుతుంది. అలా యావరేజ్ మైలేజ్ కూడా మెరుగుపరుస్తుంది. ఈ కొత్త యాక్టివా 7జీ లో ఇప్పటికే ఉన్న టైర్ల కంటే కంపెనీ కాస్త పెద్ద టైర్లను ఇవ్వనుంది. పెద్ద వీల్స్, వెడల్పైన టైర్లు స్కూటర్ హ్యాండ్లింగ్ చాలా మెరుగుపరుస్తుంది. యాక్టీవా 7జీ లో కొత్త అండ్ మెరుగైన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇవ్వవచ్చు. ప్రస్తుత యాక్టివా అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది. కొత్త యాక్టివాలో కంపెనీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఇవ్వవచ్చని తెలుస్తోంది.  దీని వల్ల మెరుగ్గా కనిపించడమే కాకుండా ఇతర కంపెనీల స్కూటర్ల లాగానే యాక్టివా కూడా అప్‌డేట్ అవుతుంది. అంతేకాకుండా, కంపెనీ బ్లూటూత్ కనెక్టివిటీ, హైబ్రిడ్ స్విచ్ వంటి ఎన్నో ఇతర ఫీచర్లను కూడా అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్టివా డిజైన్‌లో పెద్దగా మార్పులు ఉండవు. కాగా ఇప్పటివరకు యాక్టివా స్టాండర్డ్ డిజైన్‌లో కంపెనీ ఇప్పటివరకు ఎటువంటి మార్పులు చేయలేదు. ఫస్ట్ జనరేషన్ యాక్టివా నుండి ప్రస్తుత యాక్టివా వరకు డిజైన్ దాదాపు ఒకే విధంగా ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu