బ్లూటిక్ వెరిఫికేషన్ ప్రక్రియ అమల్లోకి తెచ్చారు. భారత్‌లో ట్విట్టర్ యూజర్లు ఇక నుంచి నెల వారీగా వెరిఫికేషన్‌కు రూ.719 పే చేస్తేనే ట్విట్టర్ సేవలు అందుబాటులో ఉంటాయి. అమెరికాలో ఎనిమిది డాలర్లు చెల్లిస్తే సరిపోతుంది. అంటే రూ.646తో పోలిస్తే రూ.719 అంటే అమెరికన్ల కంటే ఇండియన్స్‌కు బ్లూ టిక్ వెరిఫికేషన్ చార్జీ ఎక్కువ అన్న మాట. ఇప్పటికే భారత్‌లోని ట్విట్టర్ యూజర్లకు `బ్లూ టిక్` వెరిఫికేషన్ సబ్‌స్క్రిప్షన్ చేసుకోవాలని మెసేజ్‌లు వచ్చాయి. ప్రస్తుతానికి ఐ-ఫోన్ యూజర్లకు మాత్రమే ఈ పెయిడ్ వెరిఫికేషన్ అమల్లోకి వచ్చింది. మున్ముందు మిగతా ఫోన్ల యూజర్లకూ వర్తింప చేయనున్నది. ట్విట్టర్ బ్లూ వెరిఫికేషన్ పొందిన వారు ఎటువంటి వెరిఫికేషన్ ప్రక్రియ లేకుండానే `బ్లూ టిక్` పొందుతారు. ఈ బ్లూ టిక్ ఖాతాదారులకు పలు ప్రయోజనాలు ఉంటాయని ఎలన్‌మస్క్ ఇంతకుముందే ప్రకటించారు. ఇటువంటి వెరిఫికేషన్ లేకపోతే నకిలీ ఖాతాలు పెరిగిపోయే ప్రమాదం ఉంటుందని ఎలన్‌మస్క్ భావిస్తున్నారు. ఇందుకోసం కొందరు ప్రముఖ వ్యక్తులను గుర్తించడానికి `అధికారిక` ట్యాగ్ తీసుకొచ్చింది. కానీ దీనిపై గందరగోళం తలెత్తడంతో ట్విట్టర్ వెనక్కు తగ్గింది.
ట్విట్టర్ బ్లూ టిక్‌కు@719
0
November 11, 2022
Tags