Ad Code

853 టెక్ కంపెనీల్లో 1,37,492 మంది తొలగింపు !


ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికమాంద్యం వల్ల టెక్ కంపెనీల్లో మరిన్ని ఉద్యోగాల కోతలు రానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 853 టెక్ కంపెనీలు ఇప్పటి వరకు 137,492 మంది ఉద్యోగులను తొలగించాయి. కోవిడ్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి 1388 కంపెనీలు 2,33,483 మంది ఉద్యోగులను తొలగించాయని టెక్ లేఆఫ్‌ల క్రౌడ్‌సోర్స్ డేటాబేస్ వెల్లడించింది. 2022వ సంవత్సరం టెక్ రంగానికి గడ్డు పరిస్థితులను మిగిల్చింది. నవంబర్ నాటికి మెటా, ట్విట్టర్, సేల్స్‌ఫోర్స్, నెట్‌ఫ్లిక్స్, సిస్కో, రోకు, ఇతర సంస్థల్లో భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలు జరిగాయి. దీని కారణంగా యూఎస్ టెక్ రంగంలో 73,000 కంటే ఎక్కువ మంది కార్మికులు తొలగింపునకు గురయ్యారు. అమెజాన్, పీసీ, ప్రింటర్ మేజర్ హెచ్‌ పీ ఇంక్ వంటి బిగ్ టెక్ కంపెనీలు గ్లోబల్ లేఆఫ్ సీజన్‌లో చేరాయి.ఈ కంపెనీల రాబోయే రోజుల్లో 10వేల మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధంగా ఉన్నాయి.2023 ప్రారంభంలో కంపెనీలో మరిన్ని తొలగింపులు ఉంటాయని అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ ఉద్యోగులను హెచ్చరించారు. పేలవమైన పనితీరు కనబర్చిన ఉద్యోగులను తొలగించడానికి గూగుల్ మాతృసంస్థ సమాయత్తమైంది. బైజూస్, అన్కాడమీ, వేదాంతు, ఎడ్ టెక్ కంపెనీలు 44 స్టార్టప్ ల నుంచి 16వేల మంది ఉద్యోగులను వెళ్లవలసిందిగా కోరాయి.టెక్ స్టార్టప్‌లు, యునికార్న్‌లలో ఒలా, కార్స్24, మీషో, లీడ్, ఎంపీఎల్, ఇన్నోవాక్సిర్, ఉదాన్ కంపెనీల్లోనూ ఉద్యోగాల కోత ఉంది. ఉద్యోగుల వరుస తొలగింపులతో 2022 టెక్కీలకు అత్యంత కఠినమైన సంవత్సరంగా మారింది. గత 12 నెలల్లో శాశ్వత ఉద్యోగుల నియామకాలు గణనీయంగా 61 శాతం తగ్గాయి.

Post a Comment

0 Comments

Close Menu