Ad Code

ట్విట్టర్ మాస్ లేఆఫ్స్ !


ట్విట్టర్ కొత్త బాస్ ఎలన్ మస్క్ తీసుకున్న మాస్ లేఆఫ్స్ నిర్ణయంతో హెచ్‌1బి వీసాదారులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హెచ్‌1బి వీసాదారుల్లో లేఆఫ్స్ బాధితులు అటు మైక్రోబ్లాగింగ్ సైట్‌లో ఉద్యోగం కోల్పోవడంతో పాటు ఆరు నెలల్లోగా మరో జాబ్ లభించకపోతే అమెరికాను వీడి వెళ్లాల్సిన పరిస్ధితి నెలకొంది. పెద్దసంఖ్యలో ఉద్యోగులపై ట్విట్టర్ వేటు వేయడంతో వేలాది మంది తమ ఉద్యోగాలను కోల్పోవడంతో పాటు వారిలో పలువురి ఇమిగ్రేషన్ స్టేటస్‌పైనా నీలినీడలు పరుచుకున్నాయి. తమను స్పాన్సర్ చేసేందుకు వారికి మరో సంస్ధ ఆశ్రయం ఇవ్వాల్సి ఉంటుంది, లేనిపక్షంలో వారంతా అమెరికాను విడిచివెళ్లాల్సి వస్తుంది. ట్విట్టర్‌లో పనిచేసే మొత్తం ఉద్యోగుల్లో 8 శాతం మంది అంటే దాదాపు 625 నుంచి 670 మంది వరకూ హెచ్‌-1బీ వీసాదారులు ఉన్నారని యూఎస్ సిటిజన్‌షిప్‌, ఇమిగ్రేషన్ సర్వీసెస్ గణాంకాలను ఉటంకిస్తూ ఫోర్బ్స్ రిపోర్ట్ పేర్కొంది. మరోవైపు కంపెనీలో సగం మందిపై వేటు పడిందని ట్విట్టర్ నిర్ధారించగా వీరిలో ఎంతమంది విదేశీ వర్కర్లు ఉన్నారనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. అమెరికాలో విదేశీ వర్కర్లు సహజంగా భిన్నమైన నిబంధనలతో కూడిన హెచ్‌-1బి, ఎల్‌-1, 0-1 వీసాలపై పనిచేస్తుంటారు. హెచ్‌-1బి ఉద్యోగి జాబ్‌ను కోల్పోతే 60 రోజుల్లోగా మరో ఉద్యోగంలో చేరాలి. 60 రోజుల గ్రేస్ పీరియడ్‌లో మరో జాబ్‌లో చేరనిపక్షంలో వారు అమెరికాను వీడివెళ్లాల్సి ఉంటుంది. మరోవైపు ఎల్‌-1, ఓ-1 వీసాలపై ఉద్యోగం చేసే వారు తమ ఉపాధిని కోల్పతే తక్షణమే దేశాన్ని విడిచివెళ్లాలని లాక్వెస్ట్‌కు చెందిన పూర్వి చోతాని చెబుతున్నారు.

Post a Comment

0 Comments

Close Menu