డిజిటల్‌ పేమెంట్‌ యాప్స్‌ నుంచి లావాదేవీలు జరుపుతున్నారా?
Your Responsive Ads code (Google Ads)

డిజిటల్‌ పేమెంట్‌ యాప్స్‌ నుంచి లావాదేవీలు జరుపుతున్నారా?


మార్కెట్లో కొత్త కొత్త యాప్స్‌ పుట్టకొస్తున్నాయి. టెక్నాలజీ పెరుగుతున్న కారణంగా ఆర్థిక లావాదేవీలను సులభతరం అవుతోంది. ఈ నేపథ్యంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి యూపీఐ డిజిటల్‌ పేమెంట్స్‌ విషయంలో పరిమితులు విధించేందుకు సిద్ధమవుతోంది. గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం లాంటి థర్డ్‌పార్టీ యాప్స్‌ నుంచి యూపీఐ లావాదేవీలు నిర్వహించడం, ఈ యాప్స్‌ నుంచి లావాదేవీలు 30 శాతం మించి రాకూడదన్న నిబంధనలు విధించే అవకాశం కనిపిస్తోంది. ఇది కనుక అమల్లోకి వచ్చినట్లయితే డిజిటల్‌ లావాదేవీల యాప్స్‌ వాడకంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. నెలకు ఇన్ని లావాదేవీలు మాత్రమే జరిపేందుకు అవకాశం ఉంటుదనే నిబంధనలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో యాప్స్‌ వాడకంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ డిజిటల్‌ యుగంలో మోసాలు పెరిగిపోతున్నాయి. మోసాలు జరుగకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కొత్త కొత్త మార్గాల్లో మోసాలు చేసేందుకు ముఠాలు పుట్టుకొస్తున్నాయి. మొబైల్ పేమెంట్స్‌ యాప్స్‌ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేయడానికి అవతలి వ్యక్తి బ్యాంకు అకౌంట్ల వివరాలు పూర్తిగా తెలిసి ఉండాలి. అవి మన అకౌంట్‌కు లింకై ఉండాలి. అప్పుడే డబ్బులు పంపేందుకు అవకాశం ఉంటుంది. ఇవి అన్ని కూడా ఒక్కఫోన్‌ నెంబర్‌ ఉంటే చాలు ఎవరికైనా డబ్బులు పంపుకొనే వెసులుబాటు ఉంటుంది. ఈ సర్వీసులు అందించే యాప్స్‌ గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం, వాట్సాప్‌ పే లాంటివి ఉన్నాయి. యాప్స్‌ ద్వారా చేసే లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో రకరకాల కొత్త యాప్స్‌ పుట్టుకొస్తున్నాయి. వీటిలో ఏవి నమ్మాలో.. ఏవి నమ్మకూడదో తెలియని పరిస్థితి ఉంది. ముందుగా ప్లేస్టోర్‌ గానీ, యాప్‌ స్టోర్‌లో గానీ ఈ యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు యాప్‌కు సరైన రేటింగ్స్‌ ఉన్నాయా? రివ్యూస్‌ ఉన్నాయా వాటివి గమనించాలి. అలాగే యాప్స్‌ లాగి కావడానికి ఎలాంటి నియమాలు ఉన్నాయో గుర్తించాలి. పగడ్బందీగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని గమనించాలి. అలాగే యాప్స్‌కు బలమైన పాస్‌వర్డ్‌ సెట్‌ చేసుకునేందుకు అనుమతి ఉంటుందా? లేదా అనేది గమనించాలి. ఫోన్‌ ఓపెన్‌ చేసేందుకు ఇచ్చే పాస్‌వర్డ్‌.. యాప్స్‌ ఓపెన్‌ చేసేందుకు మళ్లీ మళ్లీ పాస్‌వర్డ్‌ అడుగుతుందా అనేది చూడాలి. యాప్‌ నుంచి ఇతరులకు డబ్బులు పంపినా, డబ్బులు వచ్చినా నోటిఫికేషన్స్‌ వస్తున్నాయా? లేదా అనేది గమనించాలి. ఇతరులకు పేమెంట్‌ చేసే ముందు కన్‌ఫర్మేషన్‌ అడుగుతుందా? లేదా చూడాలి. యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసే ముందు ఎలాంటి పర్మిషన్లు అడుగుతుంది..? ఇంకా అందులో ఎలాంటి వివరాలు ఉన్నాయో తప్పకుండా గుర్తించాలి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog