దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో సేవలు మంగళవారం నిలిచిపోయాయి. వినియోగదారులు కాలింగ్, మెసేజింగ్ లలో పలు సమస్యలను ఎదుర్కొన్నారు. సోమవారం రాత్రి నుంచే సేవలను నిలిచిపోయాయని పలువురు యూజర్లు తెలిపారు. ఈ విషయంపై పలువురు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. చాలా మంది వినియోగదారులు మొబైల్ ఇంటర్నెట్ సేవలను ఉపయోగించగలిగినా ఫోన్‌కాల్స్ చేయలేకపోయినట్లు తెలిపారు. కాలింగ్, ఎస్‌ఎంఎస్ సేవలు దాదాపు మూడు గంటల పాటు నిలిచిపోయాయి. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు నిలిచిపోయినట్లు సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు పేర్కొన్నారు. కాలింగ్, మెసేజింగ్‌కు అంతరాయం ఏర్పడిందని, డేటా సర్వీసెస్‌కు ఇబ్బంది కలగలేదని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. కాగా.. జియో సర్వీసులు నిలిచిపోవడంపై సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్‌గా మారాయి. మరోవైపు, ఓ యూజన్ తన మొబైల్‌లో ఉదయం నుంచి వోల్టీ సిగ్నల్ కనిపించడం లేదని, ఫోన్‌కాల్స్ చేయలేకపోయినట్లు ట్వీట్ చేశాడు. సాధారణ కాల్స్‌లో సమస్యలు ఉన్నప్పుడు 5జీ సేవలు ఎలా అందిస్తారని కంపెనీని ప్రశ్నించాడు. ప్రస్తుతం ట్విట్టర్‌లో #Jiodown ట్రెండ్ అవుతున్నది. కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే తన ఫ్లైట్ మిస్సయిందని ఓ యూజర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఎవరు పరిహారం చెల్లిస్తారంటూ ప్రశ్నించాడు.
నిలిచిన జియో సేవలు !
0
November 29, 2022
Tags