Ad Code

ఇండియాలో అమెజాన్ హోల్‌సేల్ వ్యాపారం మూసివేత


అమెజాన్ ఇటీవల వరుసగా తన వ్యాపారాలను క్లోజ్ చేస్తోంది. మన దేశంలో అమెజాన్.కామ్ కేవలం వారం రోజుల వ్యవధిలో తన మూడవ వ్యాపారాన్ని మూసివేయటం ప్రస్తుతం చర్చనీయాశంగా మారింది. నవంబర్ 24న అమెజాన్ అకాడమీని, నవంబర్ 25న అమెజాన్ ఫుడ్‌ను నిలిపివేసింది కంపెనీ. తాజాగా ఈ కామర్స్ దిగ్గజం దేశంలో ఖర్చులను తగ్గించుకోవటం కష్టతరంగా మారటంతో మరో వ్యాపారానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. హోల్‌సేల్ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ డిస్ట్రిబ్యూషన్‌ను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. అమెజాన్ డిస్ట్రిబ్యూషన్ తాజా నిర్ణయం వల్ల కర్ణాటకలోని బెంగళూరు, మైసూర్, హుబ్లీ నగరాల చుట్టుపక్కల ప్రాంతాల్లోని దుకాణాలకు డిస్ట్రిబ్యూషన్‌ సేవలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న కస్టమర్లు, భాగస్వాములను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని దశలవారీగా నిలిపివేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. దేశంలో కిరాణా, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, B2B ఆఫర్‌ల వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడాన్ని కొనసాగించనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. అమిత్ అగర్వాల్ నేతృత్వంలోని అమెజాన్ ఇండియా.. దాదాపు దశాబ్దపు కార్యకలాపాల్లో లాభదాయకతను పొందడం చాలా కష్టమైంది. భారతదేశంలో అమెజాన్ ఇప్పటి వరకు 6.5 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టబడింది. అయితే లాభదాయకత అస్పష్టంగానే ఉండటంతో ఇటీవల సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. 

Post a Comment

0 Comments

Close Menu