అన్నింటికీ టైప్ - సి యూఎస్బీ పోర్ట్ !
Your Responsive Ads code (Google Ads)

అన్నింటికీ టైప్ - సి యూఎస్బీ పోర్ట్ !


దేశంలో అన్ని రకాల స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ డివైజ్‌లు ఒకే రకమైన ఛార్జింగ్ పోర్టు కలిగి ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అన్నింటికీ టైప్ - సి రకం యూఎస్బీ పోర్టు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేసింది. పలు కేంద్రమంత్రిత్వ శాఖలు, ఎలక్ట్రానిక్ పరిశ్రమల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి ఆయా పరిశ్రమల ప్రతినిధులు కూడా అంగీకరించారు. అయితే ఎన్ని రోజుల్లో టైప్ - సి పోర్టు అందుబాటులో తీసుకురావాలనే అంశంపై కేంద్రం నిర్ణీత గడువు విధించలేదు. అంచనాల ప్రకారం యాపిల్ సహా అన్ని స్మార్ట్ ఫోన్లు, ట్యాబులు, స్మార్ట్ వాచీలకు టైప్ - సి ఛార్జర్లు ఉండనున్నాయి. కాగా, నిరక్షరాస్యులు, పేదలు ఎక్కువగా వినియోగించే ఫీచర్ ఫోన్లకు ఒకే రకమైన ఛార్జింగ్ పోర్టుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog