Ad Code

డిస్నీ ఉద్యోగులపై వేటు ?


ఆదాయం పడిపోవడంతో డిస్నీ సైతం వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఉద్యోగులపై వేటు వేయనున్నట్టు కంపెనీ సీఈఓ బాబ్ చాపెక్ సంకేతాలు పంపారు. కంపెనీలో నూతన నియామకాలను నిలిపివేస్తున్నామని, ఇది మీ టీమ్స్‌కు ఎలా వర్తింపచేయాలనేది ఉన్నతాధికారులు, హెచ్ఆర్ బృందాలు నిర్ధారిస్తాయని ఆయా డివిజన్ హెడ్స్‌కు పంపిన మెమోలో డిస్నీ సీఈఓ బాబ్ చాపెక్ పేర్కొన్నారు. ఈ సమీక్షలో భాగంగా కొద్దిమంది ఉద్యోగులనూ తొలగించాలని యోచిస్తున్నట్టు కూడా ఈ మెమోలో ఆయన బాంబు పేల్చారు. మొత్తం 1,90,000 మంది ఉద్యోగులు డిస్నీలో పనిచేస్తున్నారు. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా కంపెనీ ఉన్నతాధికారులు బిజినెస్ టూర్స్‌ను తగ్గించాలని కోరారు. అత్యవసర ట్రిప్‌లను మాత్రమే చేపట్టేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశాలు సైతం వర్చువల్‌గా నిర్వహించాలని ఆయా విభాగాధిపతులకు సూచించారు.

Post a Comment

0 Comments

Close Menu