Ad Code

సిమ్ కార్డు వివరాలు తెలుసుకోవడం ఎలా ?


మీ పేరు మీద తీసుకున్న అన్ని సిమ్ కార్డ్స్ వివరాలు అన్ని తెలుసువచ్చు. దీనికోసం మీరు ఎటువంటి యాప్స్ లేదా మరింకేదైనా అప్లికేషన్ ఇవ్వవలసిన అవసరం కూడా లేదు. ఆన్లైన్లో మీ మొబైల్ లేదా కంప్యూటర్ నుండి సింపుల్ గా చూడవచ్చు. కేవలం మీరు మీ పేరు మీద తీసుకున్న మొబైల్ నంబర్లు మాత్రమే కాదు వాటి వివరాలు మరియు ప్రస్తుతం వాడుకలో ఉన్న నంబర్లను కూడా తెలుసుకోవచ్చు. టెలికం యూజర్లు తీసుకున్న అన్ని మొబైల్ నంబర్ వివరాలను మరియు వాటి యాక్టివ్ స్టేటస్ ను పారదర్శకంగా ఉంచడం కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) ఇటీవల తీసుకొచ్చిన కొత్త వెబ్సైట్ ద్వారా ఈ వివరాలు తెలుసుకోవడం సులభతరమయ్యింది. ఈ వెబ్సైట్ ద్వారా మీరు తీసుకున్న మొబైల్ నంబర్ల కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెల్సుకోవచ్చు. మొబైల్ ఫోన్ బ్రౌజర్ లేదా ల్యాప్టాప్ లేదా కంప్యూటర్లో tafcop.dgtelecom.gov.in వెబ్ సైట్ ని తెరవండి. తరువాత, సూచించిన వద్ద మీ మొబైల్ నంబర్ నమోదు చేయండి. క్రింద OTP రిక్వెస్ట్ కోసం సూచించిన బాక్స్ పైన నొక్కండి. మీ మొబైల్ నంబర్ కు వచ్చిన OTP ని ఎంటర్ చేసి తనిఖీ చేయండి. OTP ని ధృవీకరించిన తరువాత, మీ పేరులో పనిచేసే అన్ని మొబైల్ నంబర్స్ యొక్క పూర్తి జాబితాను మీరు అందుకుంటారు. వాటిలో, మీరు మీ సౌలభ్యం ప్రకారం ఏదైనా నంబర్ గురించి రిపోర్ట్ చెయవచ్చు. తరువాత, మీరు కోరుకున్న నంబర్ మాత్రమే వాడుకలో ఉంటుంది మరియు మీరు ఫిర్యాదు చేసిన నంబర్లను ప్రభుత్వం తనిఖీ చేస్తుంది. ప్రస్తుతానికి , ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కేరళా, రాజస్థాన్, జమ్మూ కాశ్మిర్, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ మరియు మేఘాలయ కంజ్యూమర్లకు మాత్రమే ఈ సౌలభ్యం అందుబాటులో వుంది. 

Post a Comment

0 Comments

Close Menu