ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు వాడుతున్న వారి ఫోన్‌లోని సమాచారం మొత్తం హ్యాకర్ల చేతికి వెళ్లే అవకాశం ఉన్నదని, గూగుల్, బిట్ డిఫెండర్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థలు యూజర్లకు పలు సూచనలు చేశాయి. ఆండ్రాయిడ్ ఫోన్లకు షార్క్‌బాట్ అని పిలిచే మాల్‌వేర్ ముప్పు పొంచి ఉంది. ప్లే స్టోర్‌లో ఉన్న ఆరు యాప్‌ల ద్వారా షార్క్‌బాట్ మాల్‌వేర్ స్మార్ట్ ఫోన్లలోకి ప్రవేశిస్తోంది. ఎక్స్-ఫైల్ మేనేజర్, ఫైల్ వోయోజర్, ఫోన్ ఎయిడ్, క్లీనర్, బూస్టర్ 2.6, లైట్ క్లీనర్ ఎమ్ అనే ఆరు యాప్స్ ద్వారా షార్క్‌బాట్ మాల్‌వేర్ స్మార్ట్ ఫోన్లలోకి ప్రవేశిస్తోంది. అందువల్ల ఈ యాప్స్‌ను యూజర్లు తమ ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచి వెంటనే డిలీట్ చేయాలని సూచించింది. అయితే, ఇది గమనించే లోపే చాలా మంది యూజర్లు వీటిని తమ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకున్నారు. ఒకవేళ ఇప్పటికే ఇన్‌స్టాల్ చేసుకుని ఉంటే వీటిని డిలీట్ చేయాలి. యూజర్లు వీటిని డిలీట్ చేయడంతోపాటు, తమ ఇతర యాప్స్‌కు సంబంధించిన పాస్ వర్డ్స్, యూజర్ నేమ్స్ మార్చుకోవాలి. ఈ యాప్స్‌ను గూగుల్ ఇప్పటికే ప్లే స్టోర్ నుంచి డిలీట్ చేసింది. ఈ యాప్స్ ఫోన్లో ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత యూజర్ల బ్యాంకింగ్ వివరాలు, ఇతర యాప్స్ వివరాల్ని ఆయా సంస్థలు సేకరిస్తున్నాయి. ఈ యాప్స్ బారి నుంచి తప్పించుకోవాలంటే యూజర్లు ప్లే ప్రొటెక్ట్ సర్వీస్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. అలాగే ఆండ్రాయిడ్ యాంటీ వైరస్ యాప్స్ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అప్పుడే యూజర్ల డేటాకు రక్షణ ఉంటుంది.
ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ హెచ్చరిక !
0
November 27, 2022
Tags