Ad Code

టెలిగ్రామ్ లో వాయిస్ టు టెక్స్ట్ ?


2013లో ప్రారంభమైన టెలిగ్రామ్ తొమ్మిదేళ్లపాటు వినియోగదారు లకు ఉచిత సేవలను అందిస్తూనే ఉంది. టెలిగ్రామ్ లో అదునాతనమైన ఫీచర్స్ తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోని ఈ మధ్యకాలంలో టెలిగ్రామ్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు అనేక రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. టెలిగ్రామ్ సంస్థ తాజాగా మరొక సరికొత్త ఫ్యూచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. టెలిగ్రామ్ లో వాయిస్ టు టెక్స్ట్ ఫీచర్ ని తీసుకువచ్చింది. ఈ ఫీచర్ వల్ల ఎన్నో లాభాలు ఉండడంతో పాటు ఈజీగా వాయిస్ మెసేజ్ చేయడంతో పాటు వాయిస్ టెక్స్ట్ రూపంలో కూడా పంపించవచ్చని ఇంస్టాగ్రామ్ సంస్థ వెల్లడించింది. ఈ ఫీచర్ ఏ విధంగా పనిచేస్తుంది అన్న విషయానికి వస్తే.. సాధారణంగా చాలామంది ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు లేదా కుటుంబ సభ్యులు ఉన్న ప్రదేశాలలో వాయిస్ మెసేజ్ పంపడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అటువంటి వారు ఈ వాయిస్ టు టెక్స్ట్ మెసేజ్ ద్వారా వారు చెప్పాలి అనుకుంటున్నా అసలు విషయాన్ని చెప్పవచ్చు. టెక్స్ట్ సైజుని మనకు ఇష్టం వచ్చిన విధంగా సరి చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ హోం స్క్రీన్ పైనే ఉంటుంది. అలాగే ఎమోజీ విషయంలో కొత్త టెక్నాలజీని తీసుకువచ్చింది ఇంస్టాగ్రామ్ సంస్థ. మనం ఎవరికైనా ఎమోజిని పంపితే దానికి సంబంధించిన రియాక్షన్ ఎమోజీలు కూడా స్క్రీన్ మీద మనకు కనిపిస్తాయి. టెలిగ్రామ్ లో 12 రకాల కష్టమైజ్డ్ ఇమేజిలతో పాటుగా స్టిక్కరింగ్ ప్యాక్ ను కూడా తీసుకువచ్చింది ఇంస్టాగ్రామ్ సంస్థ. టెలిగ్రామ్ లో ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ అనగా ఇంస్టాగ్రామ్, స్నాప్ చాట్, ఫేస్బుక్ ని కూడా బయోలో పెట్టుకోవచ్చు. 

Post a Comment

0 Comments

Close Menu