Ad Code

ఫోటోను బ్లర్ చేసుకునేలా కొత్త ఫీచర్ !


డెస్క్ టాప్ యూజర్ల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్లు తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరు డెస్క్ టాప్ బీటా యూజర్లకు ఇమేజ్ బ్లర్ టూల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలో యూజర్లందరికీ ఈ ఫీచర్ వచ్చే అవకాశం ఉంది. ఇమేజ్ బ్లర్ టూల్ గురించి వాట్సాప్ బీటా ట్రాకర్ డబ్ల్యూ బీటా ఇన్ఫో వెల్లడించింది. కొందరు డెస్క్ టాప్ బీటా యూజర్లకు ఈ సదుపాయాన్ని వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చిందని రిపోర్ట్ ద్వారా తెలిపింది. మరింత సెక్యూర్ గా ఫోటోలు షేర్ చేసుకునేందుకు ఈ బ్లర్ టూల్ ఉపయోగపడుతుంది. ఫోటోలు పంపించే ముందు ఆ ఫోటోలోని ఏదైనా భాగాన్ని ఈ టూల్ సహాయంతో బ్లర్ చేసి పంపించే అవకాశం ఉంటుంది. అంటే రిసీవర్కు ఏదైనా భాగం ఫోటోలు కనిపించకూడదు అనుకుంటే దాన్ని బ్లర్ చేసి పంపించే సదుపాయం ఈ టూల్ వలన కలగనుంది. త్వరలోనే ఇమేజ్ బ్లర్ ఫీచర్లు మొబైల్ బీటా వెర్షన్ కు కూడా తెచ్చే అవకాశం ఉంది. యూజర్లందరికీ ఈ బ్లర్ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. అలాగే గ్రూపుల నుంచి సైలెంట్ గా ఎగ్జిట్ అవ్వడం, ఆన్లైన్ యాక్టివ్ స్టేటస్ ను హైడ్ చేసుకోవడం, వ్యూ వన్స్ మెసేజ్ లకు స్క్రీన్ షాట్స్ ను బ్లాక్ చేయడం వంటి ఫీచర్లను కూడా వాట్సాప్ త్వరలోనే తీసుకురాబోతుంది. ఈ ఫీచర్లు కూడా వినియోగదారులందరికీ అది కొద్ది రోజుల్లోనే వస్తాయి. మరోవైపు వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా 2.22.23.15 వర్షన్ తో ఓ కొత్త ఫీచర్ను అందిస్తుంది. మీడియా క్యాప్షన్ తో ఫార్వర్డ్ చేసుకుని సదుపాయం ఇస్తుంది. మరోవైపు వినియోగదారులందరూ ఎదురుచూస్తున్న ఎడిట్ మెసేజ్ పై వాట్సాప్ పని చేస్తుంది. ఈ ఫీచర్ మెసేజ్ సెండ్ చేసిన తర్వాత ఎడిట్ చేసుకునే సదుపాయాన్ని ఇస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu