ఇటీవల చైనాలో లాంఛ్ అయిన వివో ఎక్స్90 సిరీస్ గ్లోబల్ లాంఛ్‌లో భాగంగా భారత్‌లోనూ జనవరి 31న అందుబాటులోకి రానుంది. వివో ఎక్స్90 సిరీస్‌లో స్టాండర్డ్, ప్రొ, ప్రొ+ వంటి మూడు మోడల్స్ రానున్నాయి. వివో ఎక్స్90 సిరీస్ గ్లోబల్ లాంఛ్‌పై కంపెనీ అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించకున్నా అంకిత్ అనే ట్విట్టర్ ఖాతాలో వెలుగుచూసిన పోస్టర్‌లో 2023 జనవరి 31న వివో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లు లాంఛ్ అవుతాయని పేర్కొన్నారు. చైనాలో వివో ఎక్స్90 సిరీస్ భారత్ కరెన్సీ ప్రకారం రూ. 42400 నుంచి ప్రారంభమవుతుంది. ఇక టాప్ ఫీచర్లు కలిగిన వివో ఎక్స్90 ప్రొ+ ఖరీదు అధికంగా ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో హైఎండ్ పెర్ఫామెన్స్ కోసం లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్‌సెట్‌ను వాడుతున్నారు. ఈ డివైజ్ 6.78 ఇంచ్ అమోల్డ్ డిస్‌ప్లేతో క్యూహెచ్‌డీ+ రిజల్యూషన్‌తో కస్టమర్లను ఆకట్టుకోనుంది. ఇది ఎల్‌టీపీఓ 4.0 టెక్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇక డాల్బీ విజన్, హెచ్‌డీఆర్10+తో పాటు డీసీ డిమ్మింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 50డబ్ల్యూ వైర్‌లెస్ చార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్‌తో 4700ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంటుంది. వెనుకభాగంలో 50ఎంపీ క్వాడ్ రియర్ కెమెరాను కలిగిఉంది.
0 Comments