Header Ads Widget

త్వరలో మోటో జీ53 విడుదల !


మోటో జీ 53 5జీని మొటొరొలా చైనాలో లాంఛ్ చేసింది. వచ్చే ఏడాది ఆరంభంలో దేశీయ మార్కెట్‌లోకి రానుంది. మోటో జీ52 4జీకి కొనసాగింపుగా రానున్న మోటో జీ53 5జీ తక్కువ ధరతో రానుండటంతో ఫీచర్ల విషయంలో రాజీపడాల్సి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో పాటు సెల్ఫీ కెమెరాను 16 ఎంపీ నుంచి 8 ఎంపీకి కుదించారు. మోటో జీ53 5జీ బేస్ మోడల్ భారత కరెన్సీ ప్రకారం రూ. 10,700 పలుకుతోంది. 8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర దాదాపు రూ.13,000. 5జీ కనెక్టివిటీతో మోటో జీ53 5జీ రానుండటంతో తక్కువ ధరలో మెరుగైన 5జీ ఫోన్ కోసం చూసేవారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా టెక్ నిపుణులు చెబుతున్నారు. న్యూ మొటొరోలా స్మార్ట్‌ఫోన్ 6.5 ఇంచ్ 120హెచ్‌జడ్ ఎల్‌సీడీ స్ర్కీన్‌తో కస్టమర్ల ముందుకు రానుంది. మోటో జీ53 5జీ క్వాల్‌కాం ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను కలిగిఉంటుంది. మోటో జీ53 5జీ 18డబ్ల్యూ చార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో కస్టమర్ల ముందుకొస్తుంది.

Post a Comment

0 Comments