Ad Code

మెక్ లారెన్ 765 LTని కొనుగోలు చేసిన హైదరాబాదీ !


మెక్‌ లారెన్‌ కార్ల సంస్థను ఇండియాలో ఇన్ఫినిటీ గ్రూప్ నిర్వహిస్తోంది. ఈ బ్రాండ్ తన మొత్తం పోర్ట్‌ఫోలియోను భారతదేశ వ్యాప్తంగా విస్తరించాలని భావిస్తోంది. అందులో భాగంగానే ముంబైలో తొలి డీలర్‌ షిప్‌ని ప్రారంభించింది. ఈ సంస్థకు చెందిన సూపర్ కారు మెక్ లారెన్ 765 LTని ప్రదర్శనకు ఉంచింది. దీన్ని ఖరీదు 12కోట్ల రూపాయలు. ఇంత ఖరీదు చేసే సూపర్ కారును హైదరాబాద్‌కి చెందిన  నసీర్ ఖాన్ అనే వ్యాపారవేత్త  సొంతం చేసుకున్నారు . నసీర్‌ఖాన్‌కి లగ్జరీ కార్లు అంటే ఇష్టం. ఖరీదైన కార్లు మార్కెట్‌లోకి రాగానే ముందుగా తానే కొనుగోలు చేసి వాటిని తన గ్యారేజ్‌లో ఉంచుకుంటుంటారు. ఇప్పటికే నసీర్‌ఖాన్ దగ్గర ఫెరారీ, లంబోర్ఘిని, రోల్స్ రాయిస్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. తాజాగా మార్కెట్‌లోకి వచ్చిన సూపర్‌ కార్ మెక్ లారెన్ 765 LTని 12కోట్ల రూపాయలతో కొనుగోలు చేయడంతో మరోసారి వార్తల్లో నిలిచారు నసీర్‌ఖాన్. ఇంతటి ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లుగా నసీర్‌ఖాన్ తన ఇన్‌స్టా హ్యాండిల్ ద్వారా వీడియోని అందరితో షేర్ చేసుకున్నాడు. మెక్‌లారెన్ కంపెనీకి చెందిన కార్లలో ప్రస్తుతం భారత్‌లో GT, Artura,720S,720S స్పైడర్, 765 LT మోడల్ కార్లతో పాటు 765 LT స్పైడర్‌లను అందిస్తోంది. నసీర్‌ కొనుగోలు చేసిన కారు కూడా మెక్‌లారెన్ 765 LT స్పైడర్‌ కావడం విశేషంగా చెప్పుకోవాలి. మెక్‌లారెన్ ఇప్పటివరకు ఉత్పత్తి చేసిన వేగవంతమైన కన్వర్టిబుల్‌లలో ఇది ఒకటి. ఇది కూపే వెర్షన్ వంటి అత్యంత ఏరోడైనమిక్ డిజైన్‌ను అందిస్తుంది. ఈ సూపర్‌కార్ యొక్క బాడీ వర్క్ కోసం కార్బన్ ఫైబర్ ఉపయోగించబడుతుంది. ఫ్రంట్ బంపర్, స్పిల్టర్, సైడ్ స్కర్ట్స్ మరియు ర్యాప్‌రౌండ్ రియర్ బంపర్‌ను పొందుతుంది. ఇది కన్వర్టిబుల్ వెర్షన్ కాబట్టి, సూపర్‌కార్ పైకప్పు కేవలం 11 సెకన్లలో ముడుచుకుంటుంది. ఒకరకంగా చెప్పాలంటే రోడ్లపై పక్షిలా ఎగురుతున్నట్లుగా కనిపిస్తుంది. 


Post a Comment

0 Comments

Close Menu