జీవితంలో గూగుల్ ఒక భాగమైపోయింది చెప్పవచ్చు. వ్యాధుల లక్షణాలు, ట్రిప్ ప్లానింగ్‌లు, రివ్యూలు, డౌట్‌లు ఇలా ఒకటేంటి అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంది గూగుల్. అయితే గూగుల్ మోస్ట్ హెల్ప్‌ఫుల్ సోర్టీస్ నుంచి టిప్స్ లిస్ట్‌ను విడుదల చేసింది. ట్రావెలింగ్, ఏదైనా ట్రిప్‌కు ప్లాన్ చేస్తున్నప్పుడు.. తక్కువ బడ్జెట్‌లో ఎలా కంప్లీట్ చేయాలని చాలా మంది గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటారు. గూగుల్ ఫ్లైట్స్ ద్వారా ధరల ట్రాకింగ్‌తో చౌకైన ఎయిర్‌లైన్ టిక్కెట్‌లను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. గమ్యస్థానం, ప్రయాణ తేదీల కోసం ట్రాకింగ్‌ను టోగుల్ చేయాలి. ఒకవేళ రాబోయే ఆరు నెలల్లో ఏవైనా ఫ్లైట్స్ ధరలు తగ్గితే గూగుల్ సంబంధిత యూజర్‌కు ఈమెయిల్ పంపుతుంది. అదే విధంగా వెకేషన్‌లో కొత్త కొత్త వాటిని చూడటానికి గూగుల్ స్ట్రీట్ వ్యూను స్ట్రోల్ చేయవచ్చు. ఈజీ యాక్సెస్ కోసం స్మార్ట్‌ఫోన్‌లో బోర్డింగ్ పాస్‌ను స్క్రీన్‌షాట్ తీసి నేరుగా గూగుల్ వాలెట్ కి యాడ్ చేయవచ్చు. బోర్డింగ్ పాస్‌ను సేవ్ చేసిన తర్వాత, ఫ్లైట్ డిలే, గేట్ ఛేంజెస్ వంటి సమాచారాన్ని గూగుల్ వాలెట్ తెలియజేస్తుంది. కొవిడ్ 19 వాక్సినేషన్ డాక్యుమెంట్స్‌ను కూడా స్క్రీన్‌షాట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. అదే విధంగా రద్దీని తప్పించుకోవడానికి గూగుల్ మ్యాప్స్ ద్వారా పాపులర్ టైమ్స్, లైవ్ బిజీనెస్ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. వర్క్‌డేను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి గూగుల్ కొన్ని రకాల టిప్స్‌ను షేర్ చేసింది. స్మార్ట్‌ఫోన్ లేదా గూగుల్ అసిస్టెంట్ డివైజ్‌లో హే గూగుల్, గుడ్ మార్నింగ్' అని చెప్పి మార్నింగ్ రోటీన్‌ని ప్లాన్ చేయవచ్చు. Google క్యాలెండర్ సెట్టింగ్స్ ద్వారా పని ప్రదేశం, పని గంటలను సెట్ చేయడం ద్వారా మీరు ఎక్కడ ఉన్నారో ఇతర వ్యక్తులకు తెలియజేయవచ్చు. అంతేకాకుండా గూగుల్ క్యాలెండర్‌లో ఫోకస్ టైమ్‌ను షెడ్యూల్ చేయడం ద్వారా డిస్ట్రాక్షన్‌ను తగ్గించుకోవచ్చు. Google మ్యాప్స్ యాప్ నుంచి ఆర్డర్ లైవ్ టేకౌట్, డెలివరీ స్టేటస్‌ను ట్రాక్ చేయవచ్చు. రీసెంట్ క్లోజ్డ్ బ్రౌజర్ విండోను రిస్టోర్ చేయడానికి క్రోమ్ యూజర్స్ Control/Command + Shift + Tను ప్రెస్ చేయండి. దీంతో అన్ని ట్యాబ్స్‌ను తిరిగి పొందవచ్చు. లూనార్ న్యూ ఇయర్, దీపావళి, ఆక్టోబర్ ఫెస్ట్ వంటి గ్లోబల్ వేడుకల కోసం టోన్‌లతో మీ Nest డోర్‌బెల్ రింగ్‌టోన్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంట్లో నెస్ట్ థర్మోస్టాట్(Nest Thermostat)ను మేనేజ్ చేయడానికి గూగుల్ హోమ్ యాప్‌ను ఉపయోగించవచ్చు. మోషన్ సెన్సింగ్, ఫోన్ లొకేషన్‌ని ఉపయోగించి ఇంట్లో ఎవరూ లేనప్పుడు నెస్ట్ థర్మోస్టాట్‌ను చెక్ చేయగలదు. దానికి అనుగుణంగా ఉష్ణోగ్రతను సర్దుబాటు చేస్తుంది. అసిస్టెంట్-ఎనెబుల్ డివైజ్‌లో 'ఓకే గూగుల్, రెస్టారెంట్స్ నియర్ మీ' అని చెప్తే.. ఉన్న చోటుకు సమీపంలో రెస్టారెంట్స్ వివరాలను పొందవచ్చు. బాగా ఇష్టమైనవారితో వర్చువల్ Chromecast ఫైర్‌ప్లేస్ సేకరించవచ్చు. హాలిడే షాపింగ్‌ను మరింత సులభతరం చేయడానికి, 2022 ట్రెండింగ్ సెర్చ్‌ల ఆధారంగా 100 గిఫ్ట్ ఐడియాలను, ఇన్‌సైట్స్‌ను గూగుల్‌లో స్క్రోల్ చేయవచ్చు. గూగుల్ సెర్చ్‌లో మెడిటేషన్ టూల్‌ను ఉపయోగించి అవసరమైన ఇన్ స్ట్రక్షన్స్ పొందవచ్చు.
0 Comments