Ad Code

టెలిగ్రామ్‌లో సిమ్ కార్డు లేకుండానే లాగిన్ !


టెలిగ్రామ్ కొత్త యూజర్లకు సిమ్ కార్డ్ లేకుండా సైన్‌అప్ చేసేందుకు కొత్త అప్‌డేట్ ప్రకటించింది. ఈ ఫీచర్‌ను యూజర్ల ప్రైవసీ కోసమే తీసుకొచ్చినట్టు కంపెనీ చెబుతోంది. వినియోగదారులు ఫ్రాగ్‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉన్న బ్లాక్‌చెయిన్-పవర్డ్ గుర్తుతెలియని నంబర్‌ను ఉపయోగించి లాగిన్ చేయవచ్చు. వినియోగదారులు తమ సొంత నంబర్‌లను షేర్ చేయడం సౌకర్యంగా లేకుంటే.. ఫ్రాగ్‌మెంట్‌లో అనామక ఫోన్ నంబర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ప్లాట్‌ఫారమ్‌లోకి లాగిన్ అవ్వడానికి OTP పొందాల్సి ఉంటుంది. అందుకు పర్సనల్ మొబైల్ నంబర్‌లు అవసరమవుతుంది. కానీ, ఈ కొత్త టెలిగ్రామ్ ఫీచర్ సాయంతో ఎలాంటి ఫోన్ నెంబర్ లేకుండానే సులభంగా టెలిగ్రామ్ అకౌంట్లో లాగిన్ కావొచ్చు. WhatsApp, Signal మెసేజ్ యాప్ కన్నా ఇప్పటికీ టెలిగ్రామ్‌కు ఆకర్షణీయమైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ టెలిగ్రామ్ ఫీచర్‌ని ఉపయోగించాలంటే.. గెట్ స్టార్ట్, స్టార్ట్ మెసేజింగ్ పై Click చేయాలి. ఫ్రాగ్‌మెంట్ నుంచి నంబర్‌ను ఎంటర్ చేసి, ప్లాట్‌ఫారమ్ నుంచి వెరిఫికేషన్ కోడ్‌ను ఎంటర్ చేయండి. ఇప్పటికే టెలిగ్రామ్ కొత్త అప్‌డేట్‌తో కొత్త ఫీచర్లను కూడా యాడ్ చేస్తోంది. ఉదాహరణకు.. యూజర్లు ఇప్పుడు అన్ని చాట్‌లను ఆటోమాటిక్‌గా డిలీట్ చేయవచ్చు. మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ఇప్పటికే 2013 నుంచి  మెసేజ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందిస్తోంది. టెలిగ్రామ్ యూజర్లు తాము పంపే లేదా స్వీకరించే మెసేజ్‌లను పూర్తిగా డిలీట్ చేసేందుకు అనుమతిస్తుంది. కొంత సమయం తర్వాత పర్సనల్ చాట్‌లను క్లీన్ చేసేందుకు ఆటో-డిలీట్ టైమర్‌లను కూడా సెటప్ చేయవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu