Ad Code

స్వాట్ ఉపగ్రహం ప్రయోగం వాయిదా


అమెరికా అంతరిక్ష సంస్థ, ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ ఉమ్మడిగా చేపట్టనున్న స్వాట్ ఉపగ్రహం ప్రయోగం వాయిదా పడింది. ఉపగ్రహాన్ని తీసుకెళ్లే స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ఇంజనల్లో తేమ ఉండడంతో ప్రయోగాన్ని నిలిపివేశారు. గురువారం ఉదయం 6-46 గంటలకు స్వాట్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపాలనుకున్నారు. అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కూడా. క్యాలీఫోర్నియాలోని వాండెర్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్‌లో స్పేస్‌ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్‌ను లాంచ్ ప్యాడ్ మీద పెట్టారు. ఆ సమయంలో రాకెట్‌లోని రెండు మెర్లిన్ ఇంజన్లలో తేమ ఉన్నట్టు శాస్త్రవేత్తలు గమనించారు. దాంతో ప్రయోగాన్ని డిసెంబర్ 16వ తేదీన  చేపట్టాలని నిర్ణయించారు. కొన్నిరోజులుగా వాండెర్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ సమీపంలో తుఫాన్ గాలులు వీచాయి. అందువల్లనే రాకెట్ ఇంజన్లలో తేమ వచ్చినట్టు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. తేమ వచ్చిన ఇంజన్లను శాస్త్రవేత్తల బృందం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఈ సంఘటనపై వాళ్లు నివేదిక ఇస్తారు. లాంచింగ్‌కు ముందు కూడా వాటిని ఒకసారి చెక్ చేస్తాం అని నాసా అధికారులు తెలిపారు. ప్రపంచంలోని మహాసముద్రాలు, చెరువులలో ఎంత నీరు ఉందనేది ఈ ఉపగ్రహం కొలుస్తుంది. స్వాట్  అనగా సర్ఫేస్ వాటర్ అండ్ ఓషియన్ టోపోగ్రఫీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నీటి వనరులపై సర్వే చేసేందుకు నాసా స్వాట్ ఉపగ్రహం ప్రయోగానికి సిద్ధపడింది. ఇదొక రాడార్ శాటిలైట్. ఇది శాస్త్రవేత్తలకు నీటి వనరుల గురించి ఇప్పటి వరకు తెలియని చాలా విషయాలను అందజేయనుంది.

Post a Comment

0 Comments

Close Menu