Ad Code

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కు మాల్వేర్‌ దాడులు !


ప్రస్తుత టెక్నాలజీ యుగంలో అన్ని విభాగాల్లో కీలకంగా మారిన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT)కి కూడా మాల్వేర్‌ బెడద తప్పలేదు. వివిధ దేశాల్లో 2020లో జరిగిన మాల్వేర్‌ దాడులపై దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ బృందం రీసెర్చ్‌ చేసింది. దీనికి సంబంధించి మైక్రోసాఫ్ట్‌ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఎక్కువగా IoTలు మాల్వేర్ ఇన్‌ఫెక్షన్‌ను గురైన మొదటి మూడు దేశాలలో ఇండియా ఉన్నట్లు పేర్కొంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(IoT) 21వ శతాబ్దపు అత్యంత ముఖ్యమైన టెక్నాలజీల్లో ఒకటిగా మారింది. సెన్సార్‌లు, సాఫ్ట్‌వేర్‌, ఇతర టెక్నాలజీల ద్వారా ఇంటర్నెట్‌లో ఇతర డివైజ్‌లతో కనెక్ట్‌ అయ్యే ఫిజికల్‌ ఆబ్జెక్ట్స్‌ని ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌గా పేర్కొంటారు. ఇప్పుడు ప్రతిరోజూ కిచెన్‌లో ఉపయోగించే డివైజెస్‌ నుంచి, కార్లు, థర్మోస్టాట్‌లు, బేబీ మానిటర్‌ల వరకు ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేసే అవకాశం ఉంది. వ్యక్తులు, డివైజ్‌ల మధ్య అంతరాలు లేని కమ్యూనికేషన్‌ సాధ్యమవుతోంది. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ ద్వారా చాలా పనులను మనుషుల అవసరం లేకుండా పూర్తి చేసేయవచ్చు. ఇంటర్నెట్‌తో కనెక్ట్‌ అయిన డివైజ్‌లు ఎప్పటికప్పుడు డేటా ఎక్స్ఛేంజ్‌ చేస్తుండటంతో ఇది సాధ్యమవుతుది. వర్క్‌స్పేస్‌ మోడర్నైజ్‌ చేయాలనుకుంటున్న దేశాలకు ఇవి ఉపయోగపడుతాయి. మైక్రోసాఫ్ట్‌ నివేదికలో సైబర్‌ దాడుల ముప్పు ఉందని, సెక్యూరిటీపై శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇన్సిడెంట్‌ రెస్పాండర్‌లు, సెక్యూరిటీ స్పెషలిస్ట్‌లు వారి ఎన్విరాన్‌మెంట్‌ను సక్రమంగా అర్థం చేసుకుని పొటెన్షియన్‌ ఇన్సిడెంట్స్‌ను నివారించడానికి మైక్రోసాఫ్ట్‌ సహకారం అందిస్తుందని తెలిపింది. IT, ఆపరేషనల్ టెక్నాలజీ (OT), IoT అంతటా పెరుగుతున్న కనెక్టివిటీతో, సంస్థలు, వ్యక్తులు సైబర్ రిస్క్ ప్రభావంపై ఆలోచించాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది. ట్రెడిషనల్‌ IT ఎక్విప్‌మెంట్‌, OT కంట్రోలర్స్‌, IoT డివైజ్‌లు అయిన రౌటర్‌లు, కెమెరాల ద్వారా ఇంటర్‌కనెక్టివిటీ వినియోగిస్తున్న చాలా కంపెనీలకు సైబర్‌ ముప్పు పెరిగినట్లు గమనించినట్లు వివరించింది. కస్టమర్ OT నెట్‌వర్క్‌లలోని అత్యంత సాధారణ ఇండస్ట్రియల్‌ కంట్రోలర్‌లలో 75 శాతంలో అన్‌ప్యాచ్డ్, ఎక్కువ తీవ్రత ఉన్న సమస్యలను గుర్తించినట్లు తెలిపింది. అంతర్జాతీయ డేటా కార్పొరేషన్ (IDC) 2025 నాటికి 41.6 బిలియన్ల IoT డివైజ్‌లు ఉంటాయని అంచనా వేసింది. ఇది సాంప్రదాయ IT డివైజ్‌ల కంటే చాలా ఎక్కువని తెలిపింది. మైక్రోసాఫ్ట్‌ సీనియర్‌ అధికారి వాసు జక్కల్ మాట్లాడుతూ..ఎనర్జీ, ట్రాన్స్‌పొర్టేషన్‌, ఇతర మౌలిక సదుపాయాలకు ఆధారమైన OT సిస్టమ్స్‌, IT సిస్టమ్‌లకు ఎక్కువగా కనెక్ట్ అవడంతో రిస్క్‌ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఇండస్ట్రీలలో కనెక్టెడ్‌ డివైజెస్‌ ద్వారా అన్ని విభాగాలను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. అధునాతన మాల్వేర్, టార్గెటెడ్‌ ఎటాక్స్‌ను ఎదుర్కోవడం ట్రెడిషినల్‌ సెక్యూరిటీ సిస్టమ్‌లకు కష్టమని అన్నారు. మైక్రోసాఫ్ట్ కూడా IoT డివైజ్‌లు, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్‌లలో(SDK) అవుట్‌ డేటెడ్‌, అన్‌ సపోర్టెడ్‌ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. బోవా ఇంటర్నెట్‌లో పబ్లిక్‌గా కనిపిస్తున్న 1 మిలియన్ IoT డివైజ్‌లను గుర్తించినట్లు చెప్పింది.

Post a Comment

0 Comments

Close Menu