Ad Code

మహిళను కాపాడిన ఐఫోన్ !


ఒక వ్యక్తి భార్య ప్రమాదానికి గురైన వెంటనే అతన్ని అప్రమత్తం చేసింది. ఈ ఫీచర్ కచ్చితమైన ప్రమాద ప్రాంతాన్ని గుర్తించేందుకు లొకేషన్ షేర్ చేసింది. ఈ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ సాయంతో అతను అంబులెన్స్ రాకముందే సంఘటన స్థలానికి చేరుకున్నాడని రెడ్డిట్ పోస్ట్ వివరించింది. తన భార్య షాప్ నుంచి ఇంటికి వెళ్తూ తనతో ఫోన్‌లో మాట్లాడుతుందని చెప్పాడు. అదే సమయంలో తనకు ఆమె అరుపు వినిపించిందని తెలిపాడు. కొన్ని సెకన్లలో ప్రమాదం జరిగిందని ఆమె ఐఫోన్ నుంచి నాకు నోటిఫికేషన్ వచ్చిందన్నాడు. అప్పుడు వెంటనే ఆమె ఉన్న లొకేషన్ ద్వారా సంఘటన స్థలానికి చేరుకున్నానని తెలిపాడు. అంబులెన్స్ రాకముందే తాను అక్కడికి చేరుకున్నానని చెప్పాడు. క్రాష్ డిటెక్షన్ ఫీచర్ చాలా సులభంగా వినియోగించవచ్చు. ఈ ఫీచర్ ఎమర్జెన్సీ SOSని యాక్టివేట్ చేస్తుంది. ఆ తర్వాత యూజర్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ లిస్ట్‌లోని ఎవరినైనా ముందుగా అలర్ట్ చేస్తుంది. అల్గోరిథం ప్రకారం.. iPhone నుంచి సమాచారాన్ని ఉపయోగిస్తుంది. క్రాష్ జరిగింది లేదో ఈ ఫీచర్ నిర్ధారిస్తుంది. వెంటనే ఎమర్జెన్సీ కోసం కాల్ చేస్తుంది. ఆపిల్ అందించే iPhone 14, iPhone 14 Pro మోడల్స్ వినియోగదారులు అత్యవసర కాంటాక్టులకు యాడ్ చేసేందుకు ఆరోగ్య యాప్‌ను విజిట్ చేయవచ్చు. 

Post a Comment

0 Comments

Close Menu