Ad Code

అలస్కాలో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన ఐఫోన్ !


అమెరికాలోని అలస్కాలో చిక్కుకున్న ఒక వ్యక్తి ఐ ఫోన్ సాయంతో  ప్రాణాలతో బయటపడ్డాడు. అతని ఐ ఫోన్ 14 శాటిలైట్ ద్వారా సాస్ మెసేజ్‌ అలర్ట్‌ను ఎమర్జెన్సీ సర్వీస్‌కు పంపించింది. యాపిల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్స జీపీఎస్ సాయంతో అతని జాడను కనిపెట్టింది. ఆ వ్యక్తి 69 డిగ్రీల అక్షాంశాల దగ్గర ఉన్నట్టు గుర్తించారు. స్థానిక అధికారులు, రెస్క్యూ టీం, కొంతమంది వాలంటీర్ల సాయంతో అతడు ఉన్న ప్లేస్‌కు వెళ్లారు. అతడిని సురక్షితంగా తీసుకొచ్చారు. ఐఫోన్ కొత్తగా తీసుకొచ్చిన ఎమర్జెన్సీ సాస్ అలర్ట్ ఫీచర్ పనిచేస్తుందా? లేదా? అనేది టెస్ట్ చేయాలనుకున్నాడు. అందుకని డిసెంబర్ 1వ తేదీన స్నో మొబైల్ లేదా మోటార్ స్లెడ్ మీద నూర్విక్ నుంచి కొట్జ్‌బు ప్రాంతానికి వెళ్తూ అలస్కాలో ఒక చోట ఆగాడు. అక్కడ మొబైల్ సిగ్నల్ లేదు. దాంతో, అతని ఐఫోన్ శాటిలైట్ సాయంతో సాస్ మెసేజ్ అలర్ట్‌ను ఎమర్జెన్సీ సర్వీస్‌కు పంపించింది. దాంతో అతడిని కనిపెట్టారు. సాస్‌ ఫీచర్‌ను టెస్ట్ చేయడం కోసం ప్రాణాలను పణంగా పెట్టడం ఏంటని? చాలామంది వాపోతున్నారు. మరికొందరు యాపిల్ సాస్ ఫీచర్ అద్భుతం అంటున్నారు. సాస్‌ వ్యవస్థ 62 డిగ్రీల అక్షాంశాలు దాటితే పనిచేయదని యాపిల్ ఇంతకుముందు తెలిపింది. కానీ, ఈ వ్యక్తి చిక్కుకున్న 69 డిగ్రీల అక్షాంశాలలోనూ సాస్ అలర్ట్ సిస్టం పనిచేయడం. ఐఓఎస్ 16.1 అప్‌డేట్‌లో భాగంగా ఎమర్జెన్సీ సాస్ మెసేజ్, వాయిస్ కాల్ అలర్ట్‌ను యాపిల్ తీసుకొచ్చింది. అత్యవసర పరిస్థితి, ప్రమాదంలో ఉన్నప్పుడు వైఫై లేదా మొబైల్ డేటా లేకున్నా కూడా సర్వీస్ పనిచేస్తుంది. ఈ ఫీచర్ ఐ ఫోన్ 14 సిరీస్‌లో ఉంది.

Post a Comment

0 Comments

Close Menu