Ad Code

అర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ దుస్తుల్లో మెరిసిన మోడల్స్‌


హాంకాంగ్‌లో జరిగిన ఫ్యాషన్ వీక్ అందర్నీఆకట్టుకుంది. అందులో మోడళ్లు ఆర్టిఫీషియల్ టెక్నాలజీతో తయారు చేసిన దుస్తుల్లో మెరిసిపోయారు. హాంకాంగ్‌కు చెందిన ఏఐడి ల్యాబ్స్ ఈ కొత్తరకం అవుట్‌ఫిట్స్‌ను తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)తో డిజైన్ చేసిన దుస్తులను ఈ సంస్థ తొలిసారిగా హాంకాంగ్‌లో జరిగిన Fashion X AI ఫ్యాషన్ వీక్‌లో ప్రదర్శించింది. వీటిని ఏఐ సాఫ్ట్‌వేర్ ఏఐడా (AiDA)తో డిజైనర్లు తయారుచేశారు. ‘డిజైనర్లకు సహాయకారిగా ఉండేందుకు ఏఐడా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించామ’ని ఏఐడి ల్యాబ్స్ సీఈఓ కాల్విన్ వాంగ్ తెలిపాడు. 14 మంది డిజైనర్లు డిజైన్ చేసిన 80 రకాల దుస్తులను మోడల్స్ ఈ ఫ్యాషన్ వీక్‌లో ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ ష్యాషన్ వీక్ ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. ‘డిజైనర్లు తాము అనుకుంటున్న డిజైన్లు, రంగులను ఈ సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేయాలి. 10 సెకన్లలోనే వాళ్లు కోరుకుంటున్న కలెక్షన్ కనిపిస్తుంది’ అని కాల్విన్ తెలిపాడు. ఈ సాఫ్ట్‌వేర్ ప్రత్యేకత ఏంటంటే.. ఇది పది సెకన్ల సమయంలోనే డజన్‌కు పైగా డిజైన్లను తయారు చేయగలదు. అంతేకాదు ఫొటోలను గుర్తించడంతో పాటు ఫొటోలను తీయగలదు అని కాల్విన్ వెల్లడించాడు.

Post a Comment

0 Comments

Close Menu