Ad Code

హెల్మెట్‌ కి ఎయిర్‌ బ్యాగ్‌ ?


హెల్మెట్‌ పెట్టుకుంటే మీ ప్రాణాలకు భరోసా ఉంటుంది. కానీ, కొన్ని ప్రమాదాల్లో హెల్మెట్‌ ధరించినా కూడా ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్లు ఉన్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే హెల్మెట్‌ను ధరిస్తే మాత్రం అలాంటి ఘటనలు చాలా తగ్గుముఖం పడతాయని రూపకర్తలు భరోసా ఇస్తున్నారు. ఇటలీకి చెందిన ఎయిరోహ్‌ అనే కంపెనీ ఈ ఆవిష్కరణను తీసుకురాబోతోంది. ఆటోలివ్‌ అనే స్వీడిష్‌ కంపెనీతో కలిసి ఎయిరోహ్‌ ఒక కొత్త హెల్మెట్‌ని తయారు చేసింది. అందుకు సంబంధించిన నమూనాని కూడా పరిచయం చేసింది. దానిని ఎయిర్‌ హెడ్‌గా పిలుస్తున్నారు. దానిని ధరిస్తే మీ ప్రాణాలకు పూర్తిగా కాకపోయినా కనీసం 80 శాతం మేర గ్యారెంటీ ఇవ్వొచ్చని చెబుతున్నారు. కారులో ఎలా అయితే ప్రమాదం జరగ్గానే డ్యాష్ బోర్డ్‌, స్టీరింగ్‌ నుంచి (సీటు బెల్టు ధరించి ఉంటేనే) ఎయిర్‌బ్యాగ్‌లు బయటకు వస్తాయో.. అలాగే ప్రమాద సమయంలో ఈ హెల్మెట్‌ నుంచి ఎయిర్‌ బ్యాగ్‌లు బయటకు వస్తాయి. తద్వారా ప్రమాదంలో వాహనదారుడిపై తీవ్రత తగ్గే అవకాశం ఉంది. తల పగలకుండా ఉండేందుకు ఈ ఎయిర్‌బ్యాగ్‌లు దోహదపడతాయని తయారీదారులు చెబుతున్నారు. అయితే ఈ ఎయిర్‌హెడ్‌ ఇంకా మార్కెట్‌లోకి రాలేదు. నమూనాను మాత్రమే ప్రజలకు పరిచయం చేశారు. దాదాపుగా వచ్చే ఏడాది ఇవి మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu