Ad Code

టెకీల్లో లేఆఫ్స్ గుబులు !


ఈ ఏడాది ఇప్పటి వరకూ 1,80,000 మందికి పైగా ఉద్యోగాలను కోల్పోయారు. ఇంత జరిగినా లేఆఫ్స్ ప్రకంపనలకు తెరపడటం లేదు. అమెరికన్ ఐటీ సంస్ధ సేల్స్‌ఫోర్స్ మరో దశ లేఆఫ్స్‌కు సన్నాహాలు చేపట్టడంతో టెకీల్లో గుబులు రేగింది. నాయకత్వ స్ధానాల్లో మార్పులు, సేల్స్ టార్గెట్లను చేరుకోవడంపై ఒత్తిళ్లు, ఇన్వెస్టర్ల ప్రభావంతో మరో విడత లేఆఫ్స్ తప్పవనే సంకేతాలు వెల్లడయ్యాయి. ఏ క్షణంలోనైనా లేఆఫ్స్ బాంబు పేలవచ్చని ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్ధిక అనిశ్చితి కారణంగా వ్యయ నియంత్రణ చర్యలపై కంపెనీ దృష్టి సారించిందనే వార్తలు వచ్చాయి. మెటా, అమెజాన్‌, ట్విట్టర్ వంటి టెక్ దిగ్గజాలు లేఆఫ్స్‌కు తెగబడిన నవంబర్‌లో సేల్స్‌ఫోర్స్ సైతం వందలాది ఉద్యోగులను తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా సేల్స్‌ఫోర్స్‌లో 73,000 మందికి పైగా ఉద్యోగులు ఉండగా ఆర్ధిక అననుకూల పరిస్ధితులు, వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా సిబ్బంది సంఖ్యను కుదించేందుకు సేల్స్‌ఫోర్స్ కసరత్తు సాగిస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu