యాపిల్ వాచ్‌పై వర్ణవివక్ష కేసు !


యాపిల్ వాచ్ వర్ణవివక్షకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ కంపెనీపై కేసు కూడా బుక్ చేశారు. న్యూయార్క్‌కు చెందిన అలెక్స్ మోరెల్స్ అనే వ్యక్తి ఆ కేసు దాఖలు చేశారు. వాచ్‌లో ఉన్న బ్లడ్ ఆక్సిజన్ రీడర్ తప్పుడు ఫలితాలు చూపిస్తున్నట్లు కేసులో పేర్కొన్నారు. చర్మ వర్ణం మారినప్పుడు ఆ వాచ్‌లో ఉన్న ఆక్సిజన్ రీడర్ సరైన రీతిలో రిపోర్ట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. వాచ్‌లో ఉన్న ఆక్సీమీటర్ టెక్నాలజీ సమర్థవంతంగా పనిచేయడంలేదన్న ఆరోపణలు ఉన్ఆనయి. రక్తంలో ఉన్న ఆక్సిజన్ స్థాయిల్ని సరైన రీతిలో ఆ మీటర్ లెక్కించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. డార్క్ స్కిన్ టోన్ ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో వాచ్‌లో ఉన్న ఆక్సిజన్ లెవల్స్ చూసుకున్న పేషెంట్లు హైరానాకు గురయ్యారని, కాస్త నలుపు వర్ణం ఉన్నవారిలో మీటర్ సరైన రీతిలో స్పందించలేదని తెలుస్తోంది. దీని వల్లే ఆ సమయంలో అనేక మంది పేషెంట్లు.. కంగారలో హాస్పిటళ్ల చుట్టూ పరిగెత్తినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. యాపిల్ వాచ్‌లో ఉన్న ఆక్సిజన్ మీటర్ రోగుల్ని తప్పుదారి పట్టించినట్లు కూడా ఓ స్టడీ రిపోర్ట్‌ను కేసులో ఫైల్ చేశారు. 

Post a Comment

0 Comments