Ad Code

అల్జీమర్స్‌ను గుర్తించే మరో కొత్త రక్త పరీక్ష


ఆల్జీమర్స్‌ మతిమరుపు కంటే భయంకరమైన వ్యాధి. ఇది నెమ్మదిగా ప్రారంభమై కాలం గడిచేకొద్దీ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఒకసారి వచ్చిందంటే మెదడుకు సమస్యే. ప్రతి క్షణం నరకంగా ఉంటుంది. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే ఈ వ్యాధి. ప్రస్తుతం 30 నుంచి 50 ఏండ్లలోపు వారిలో కూడా వస్తున్నది. ఈ వ్యాధికి గురైన వారు ఎప్పుడు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఎదురవుతుంది. అల్జీమర్స్ వ్యాధికి మెరుగైన చికిత్సా వ్యూహాలను కనుగొనడంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారు. నాడీ సంబంధ పరిస్థితులను నిర్ధారించడంలో తొలి దశల్లో సహాయపడే పరీక్షలను కొత్త అధ్యయనం గుర్తించింది. రోగనిర్ధారణ, చికిత్సను వేగవంతం చేసేందుకు, వ్యాధి పురోగతిని తగ్గించగల సంబంధిత చికిత్స ప్రభావాలను గుర్తించడానికి సరైన మరొక రక్త పరీక్షను పరిశోధకులు కనుగొన్నారు. తేలికపాటి జ్ఞాపకశక్తి కోల్పోవడం మొదలుకొని సంభాషణలను కొనసాగించే సామర్థ్యం కోల్పోవడం వరకు ఎన్నో లక్షణాలు వీరిలో కనిపిస్తాయి. లండన్ యూనివర్శిటీలోని ప్రొఫెసర్ ఆస్కర్ హాన్సన్, గోథెన్‌బర్గ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కాజ్ బ్లెనో నేతృత్వంలోని పరిశోధకుల బృందం 575 మంది రక్త పరీక్షలను విశ్లేషించి.. అల్జీమర్స్ వ్యాధి పాథాలజీని గుర్తించడంలో సరిపోయే మల్లిపుల్‌ బ్లడ్‌ బయోమార్కర్లను కనుగొన్నారు. దాదాపు 242 మందిలో కాగ్నిటివ్‌ టెస్టింగ్‌, మాగ్నెటిక్‌ రెసోనెన్స్‌ ఇమేజింగ్‌తోపాటు ప్లాస్మా పరీక్షలను ఆరేండ్ల పాటు చేపట్టారు. ఈ ఆరేండ్లలో కేవలం ఫాస్ఫో-టౌ 217 మాత్రమే ఆల్జీమర్స్‌ వ్యాధి పాథాలజీకి సంబంధించినదని వారు కనుగొన్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన విషయాలు నేచర్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

Post a Comment

0 Comments

Close Menu